ప్రధాన పేజి > వినోదం > పర్యాటక రంగం > పర్వత ప్రాంతాలు > ఆహ్లాదకర ప్రకృతి నిలయం... ఉబ్బలమడగు జలపాతం
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ఆహ్లాదకర ప్రకృతి నిలయం... ఉబ్బలమడగు జలపాతం
ఇలా శ్రమకోర్చి కొండ సగభాగానికి చేరుకుంటే అక్కడ గలగల శబ్ధంతో జాలువారే సుందర జలపాతం మనకు దర్శనమిస్తుంది. ఈ జలపాతం కింద పర్యాటకులు తనివితీరా జలకాలాడవచ్చు. ఈ జలపాతానికి చేరుకునే మార్గంలో మరో రెండు చోట్ల చిన్న తటాకాలు ఉన్నాయి. వీటిలో కూడా పర్యాటకులు చక్కగా జలకాలాడవచ్చు. దట్టమైన అడవిగుండా సాగే ఈ మార్గంలో జట్టుగా ప్రయాణించడం ఓ మర్చిపోలేని అనుభూతి.

వసతిసౌకర్యాలు :
ఉబ్బలమడుగు పూర్తిగా అటవీప్రాంతం కాబట్టి ఇక్కడ ఎలాంటి సౌకర్యాలు లేవు. కొండలపీఠ భాగం దగ్గర ఓ శివుని విగ్రహాం ఉంది. ఇక్కడకు వచ్చే పర్యాటకులు ఈ స్వామికి పూజలు చేస్తారు. పర్యాటకులకు ఏమి కావాలనుకున్నా వరదయ్యపాళెంలోనే తీసుకుని వెళ్లాల్సిందే. వరదయ్యపాళెంలోని ఆటోలులాంటి కొన్ని రకాల వాహనదారులు ఉబ్బలమడుగు వరకు రవాణా సౌకర్యం కల్పించేందుకు సిద్దంగా ఉంటారు.

అలాగే మరికొందరు పర్యాటకులు ద్విచక్ర వాహనాల్లో ఇక్కడకు చేరుకుంటారు. అయితే ఏ వాహనమైన కొండ పీఠభాగం వరకు మాత్రమే ఉపయోగపడుతుంది. కాబట్టి జలపాతాన్ని చూడాలంటే మాత్రం అక్కడినుంచి కాలినడక తప్పదు. సాధారణ రోజుల్లో ఈ పరిస్ధితి ఉంటే శివరాత్రి పర్వదినాన దాదాపు నాలుగురోజులు ఇక్కడ స్థానికుల రద్దీ విపరీతంగా ఉంటుంది. దీనివల్ల తాత్కాలికంగా కరెంటు సౌకర్యంతోపాటు కొన్ని అంగళ్లు సైతం ఇక్కడ వెలుస్తాయి.

శివరాత్రికి రెండురోజులముందు కుటుంబంతో సహా ఇక్కడకు చేరుకునే స్థానికులు మూడురోజులు ఇక్కడే వంటావార్పు చేసుకుని ఉండడం ఈ ప్రాంత ప్రత్యేకత. అయితే సాధారణ దినాల్లో ఉబ్బలమడుగును సందర్శించే పర్యాటకులు చీకటిపడే సమయానికి వరదయ్యపాళెంకు చేరుకుంటారు. ఎందుకంటే దట్టమైన అటవీప్రాంతం కాబట్టి రాత్రిపూట ఇక్కడ ఉండడం కొంచెం ప్రమాదకరమే.
రవాణా సౌకర్యాలు :
ముందే చెప్పుకున్నట్టు వరదయ్యపాళెం చేరుకుంటే అక్కడినుంచి దాదాపు ఏడు కిలోమీటర్ల వరకు చక్కని తారు రోడ్డు, ఆపై మరో నాలుగు కిలోమీటర్లు మేర మట్టిరోడ్డు ఉంది. దాదాపు అన్ని రకాల వాహనాలు ఈ మార్గం గుండా కొండల పీఠభాగాన ఉండే సరస్సు వరకు సులభంగా చేరుకుంటాయి. వారాంతాల్లో ఈ ప్రదేశానికి చెప్పుకోదగ్గ సంఖ్యలోనే పర్యాటకులు వస్తుంటారు. అయితే ఈ ప్రదేశానికి బృంధాలుగా వెళ్లడమే క్షేమకరం.
<< 1 | 2 
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
తవాంగ్ స్వర్ణ బౌద్ధ స్థూపం
అద్భుతమైన ఆంధ్రా ఊటీని చూసొద్దాం రండి
ప్రసిద్ధ జలపాతాలకు నిలయం... కుట్రాలం
కాశ్మీర్ పర్యాటక రంగంపై 'అమర్‌నాథ్' ప్రభావం  
ఆహ్లాదకర ప్రకృతి నిలయం తలకోన
నయనానందం... 'జోగ్' జలపాత వీక్షణం