ప్రధాన పేజి > వినోదం > పర్యాటక రంగం > పర్వత ప్రాంతాలు > ప్రిన్స్‌ ఆఫ్‌ హిల్‌ స్టేషన్‌: కొడైకెనాల్‌
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ప్రిన్స్‌ ఆఫ్‌ హిల్‌ స్టేషన్‌: కొడైకెనాల్‌
WD
ఇది సుందర విశ్రాంతి ప్రదేశం. ఇక్కడ సగటు వర్షపాతం 165 సెం.మీ. వృక్షాలతో నిండివున్న ఈ పర్వత ప్రాంతాన్ని ఏప్రిల్‌ నుంచి జూన్‌, సెప్టెంబర్‌ నుంచి అక్టోబర్‌లో దర్శించి సేద తీరండి. సంవత్సరం పొడవునా టూరిస్టులు వచ్చే పర్యాటక ప్రదేశం యిది. సీజన్‌లో వస్తే ఇక్కడి మనోహర దృశ్యాలను అందమైన ప్రకృతి లావణ్యాన్ని ఆస్వాదించవచ్చు.

కొడైకెనాల్‌ వాతావరణం :
వేసవి కాలం : 19.8 డిగ్రీల సెంటిగ్రేడ్‌ నుంచి 14.3 డిగ్రీల సెంటిగ్రేడ్‌ వరకు
చలికాలం : 17.3 డిగ్రీల సెంటిగ్రేడ్‌ నుంచి 8.3 డిగ్రీల సెంటిగ్రేడ్‌ వరకు
మనస్సుకి హాయి గొలిపే ఈ ప్రాంతానికి రావటానికి దగ్గరలో వున్న ఎయిర్‌పోర్ట్‌ మధురై 120 కి.మీ దూరంలో వుంది. 135 కి.మీ దూరంలో కోయంబత్తూరు ఉంది.

రైలు మార్గం : కొడై రైల్వే స్టేషన్‌‌కు ఇతర ప్రధాన నగరాల నుంచి కలుపబడి ఉంది. ఈ స్టేషనకు పళని రైల్వే స్టేషను 64 కిలోమీటర్ల దూరంలో ఉంది.
బస్సు : ఇక్కడికి బెంగుళూరు, చెన్నై పళని, మధురై, దిండిగల్‌, తిరుచిరాపల్లి, ఈరోడ్‌, కుయిలి నుంచి బస్సు సౌకర్యం ఉంది.

ప్రతి సంవత్సరం మే నెలలో బోట్‌ రేసులు జరుగుతాయి. అప్పుడే ఫ్లవర్‌ షో జరుగుతుంది. అద్భుతంగా ఉంటుంది ఈ పూల సంత. కొడైకెనాల్‌ నుంచి మధురైకి 120 కి.మీ. కొడైకెనాల్‌ పళనికి 65 కి.మీ, కోయంబత్తూరు నుంచి 78 కి.మీ, తిరుచ్చి నుంచి 197 కి.మీ, దిండిగల్‌ నుంచి 110 కి.మీ దూరంలో ఉన్నాయి.

షాపింగ్‌ : ఖాది ఎంపోరియం, హేండ్లూం, కో- ఆపరేటివ్‌ స్టోర్‌, గవర్నమెంటు సేల్స్ ఎంపోరియం, మినీ సూపర్‌బజార్‌, స్పెన్సర్‌ అండ్‌ కంపెనీ.

పర్యాటక ప్రదేశాలు :
లేక్‌ : 60 ఎకరాల్లో ఉన్న ఆకర్షణీయమైన లేక్‌ చుట్టూ పచ్చటి పొలాలు, బోటింగ్‌ సౌకర్యం టిటిపిసి వారు ఏర్పాటు చేశారు. లేక్‌కి తూర్పు దిశలో ఉన్న సుందర పార్కులో మే నెలలో హిస్టారికల్‌ షో జరుగుతుంది.
సోలార్‌ ఫిజికల్‌ అబ్జర్వేటరీ : 3.2 కి.మీ దూరంలో ఈ ప్రదేశం కొడైలో ఎత్తయినది.
ఆండవర్‌ టెంపుల్‌ : 3.2 కి.మీ దూరంలో ఉంది. మురుగన్‌ స్వామి ఈ ఆలయంలో కొలువై ఉంటారు. ఈ పాయింట్‌ నుంచి చూస్తే ఉత్తరాన ఉన్న పళని హిల్స్‌ చూడవచ్చు.

టెలిస్కోప్‌ హౌస్‌ : ఇక్కడ రెండు టెలిస్కోప్‌ హౌసెస్‌ వున్నాయి. ఒకటి కురింజి ఆండవార్‌ టెంపుల్‌ దగ్గర ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు తెరిచి వుంటుంది. రెండోది కూకల్సువీక్‌.
గ్రీస్‌ వేలి వ్యూ : 5 కి.మీ దూరంలో ఉన్న ఈ వ్యూ నుంచి వైగై డ్యామ్‌ కనిపిస్తుంది.
పిల్లర్‌ రాక్స్‌ : 7.4 కి.మీ దూరంలో యిక్కడ నుంచి సుందర ప్రకృతి కాంత సమస్త అందాలను చూడవచ్చు. ఇక్కడ సహజ సిద్ధమైన మూడు పొడవైన శిలలు ఒకదానికొకటి ఆనుకుని 400 అడుగులు ఎత్తు కలిగి వుంటాయి.
బీల్‌ షోలా ఫాల్స్‌ : 1.6 కి.మీ దూరంలో వున్న బ్యూటీ ఫర్‌ పిక్నిక్‌ స్పాట్‌.
1 | 2  >>  
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
మంచు దుప్పటి కప్పుకున్న "గ్యాంగ్‌టక్" అందాలు
ప్రకృతి సోయగాలు.. ఈశాన్య రాష్ట్రాల అందాలు...!!
"కుంటాల జలపాతం"లో స్నానం చేసొద్దామా...?!
ఆహ్లాదకర ప్రకృతి నిలయం... ఉబ్బలమడగు జలపాతం
తవాంగ్ స్వర్ణ బౌద్ధ స్థూపం
అద్భుతమైన ఆంధ్రా ఊటీని చూసొద్దాం రండి