ప్రధాన పేజి > వినోదం > పర్యాటక రంగం > పర్వత ప్రాంతాలు > ప్రిన్స్‌ ఆఫ్‌ హిల్‌ స్టేషన్‌: కొడైకెనాల్‌
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ప్రిన్స్‌ ఆఫ్‌ హిల్‌ స్టేషన్‌: కొడైకెనాల్‌
కొడైకెనాల్‌ పరిసరాల్లో
సిల్వర్‌ కాస్కేడ్‌ : ఈ జలపాతాలు ఘాట్‌రోడ్‌ వద్ద ఉన్నాయి. కొడైకెనాల్‌ నుంచి 8 కి.మీ దూరంలో ఉంది ఈ స్పాట్‌.
మ్యూజియం : 3 కి.మీ దూరంలో వుంది. 1890లో స్థాపించబడిన ఒక కాలేజి వారిచే ఈ పుష్పాల మ్యూజియం నిర్వహించబడుతుంది. మన దేశంలో వున్న ఆర్కిటోరియంలలో ఇది ఒకటి. ఇందులో 300 జాతులకు పైగా మొక్కలు వున్నాయి.
డోలు మెన్స్‌ సర్కిల్‌ : 22 కి.మీ దూరంలో ఉన్న పురాతన కాలం నాటి స్థలం
పెరుమాళ్‌ పీక్‌ : 11 కి.మీ దూరంలో గల ఈ ప్రదేశం 2,400 మీటర్ల ఎత్తున వున్న శిఖరం. ఈ ప్రయాణం పెరుమాళ్‌ మలాయ్‌ గ్రామం నుంచి ప్రారంభమౌతుంది. ఇక్కడ వాతావరణం చూస్తే ఈ ప్రాంతానికి వలస పోదామా అనిపిస్తుంది.

బెరిజం లేక్‌ : 21 కి.మీ దూరంలో గల ఈ ప్రదేశం సూపర్‌ పిక్నిక్‌ స్పాట్‌
కుక్కుళ్‌ కేవ్స్‌ : ఆది మానవులు ఈ గుహల్లో నివసించే వారట. ఇప్పుడిది విడిది ప్రాంతం.
డాల్ఫిన్‌ నోస్‌ : రాయి నిరాధారంగా కనబడుతూ చివరి భాగం ఆవలించిన నోరులా కనిపిస్తుంది.
పళని : హిందూ దేవాలయం వుంది. సుబ్రహ్మణ్యస్వామి ఆరు అవతారాల్లో ఒక మూర్తి అవతారం ఇక్కడ చూడవచ్చు. పళని రేంజ్‌లో వెస్టన్‌ ఘాట్స్‌లో ఈ గుడి పర్వతం మీద వుంది. 64 కి.మీ దూరంలో వుంది కొడైకెనాల్‌కి.

కుంభక్కరై : 12 కి.మీ దూరంలో ఈ ప్రాంతం అద్భుతమైన పిక్నిక్‌ స్పాట్‌, అందమైన జలపాతాలు ఉన్నాయి.
కొడై ఇంటర్‌ నేషనల్‌ : లామ్స్‌ ఘాట్‌ రోడ్‌, ఫోన్‌ : 40767 కొడైరిసార్ట్‌ హోటల్‌ నాయిస్‌రోడ్‌, ఫోన్‌ : 40632. గార్డెన్‌ మానర్‌, లేక్‌రోడ్‌, ఫోన్‌ : 40462. హోటల్‌ ఎస్టోరియా, అన్నాశాలై, ఫోన్‌ : 40524, యూత్‌ హాస్టల్‌, గ్రీన్‌ ల్యాండ్స్‌, ఫోన్‌ : 41009.
మధుమలై అడవులు

ఊటి నుంచి 67 కి.మీ దూరంలో మైసూర్‌కు వెళ్ళే దారిలో ఉన్నాయి. ఈ అరణ్యాలు, నీలగిరి మీద 3000 ఎత్తులో ఉన్న అరణ్యాలివి. ఇక్కడ చాలా సహజంగా ఏనుగులు, డీర్స్‌, పెద్దపులి, చిరుతలు చూడవచ్చు.
నక్కలు, కోతులు, ముంగిసలు, గండుపిల్లులు లాంటివి అనేకం అడుగడుగునా కనిపిస్తుంటాయి. ఏప్రిల్‌ నెలలో రాత్రిళ్ళు మిణుగురు పురుగులతో అడవి అంతా మెరిసిపోతుంటుంది.
ఈ అడవి మొత్తం చూడడానికి కారు లేదా ఏనుగు మీద గాని చూడవచ్చు. ఈ సౌకర్యాన్ని ఫారెస్ట్‌ డిపార్ట్‌మెంట్‌ వారు కల్పిస్తారు. బెస్ట్‌ సీజన్‌ మార్చి - జూన్‌ మధ్య చూడటానికి అనువుగా వుంటుంది.
ఇక్కడికి దగ్గరలో రెస్ట్‌హౌస్‌, టూరిస్ట్‌ లాడ్జి వుంది. ఇంకా లగ్జరీలో బాంబూబ్యాంక్స్‌ ఫామ్‌ గెస్ట్‌ హౌస్‌, లాగ్‌ హౌస్‌, ముసిని గుడిలో తెప్పకడులో యూత్‌ హాస్టల్‌ వున్నాయి. ఈ ప్రదేశాలన్నీ మధుమలై వైల్డ్‌లైఫ్‌ శాంక్చువరీ పరిసరాలు.
<< 1 | 2 
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
మంచు దుప్పటి కప్పుకున్న "గ్యాంగ్‌టక్" అందాలు
ప్రకృతి సోయగాలు.. ఈశాన్య రాష్ట్రాల అందాలు...!!
"కుంటాల జలపాతం"లో స్నానం చేసొద్దామా...?!
ఆహ్లాదకర ప్రకృతి నిలయం... ఉబ్బలమడగు జలపాతం
తవాంగ్ స్వర్ణ బౌద్ధ స్థూపం
అద్భుతమైన ఆంధ్రా ఊటీని చూసొద్దాం రండి