Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine Widgets Magazine

అజంతా ఎల్లోరా అందాలు ఆస్వాదిద్దామా!!

Widgets Magazine

File
FILE
కనులు తిప్పుకోనీయని అందాలు అజంతా సొంతం. అజంతా, ఎల్లోరా గుహలు భారతీయ శిల్పకళలకు తార్కాణం. హిందూ, బౌద్ధ, జైన మతాలకు సంబంధించిన శిల్పకళారీతులు ఒకే చోట కనువిందు చేస్తాయి. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన ఘృష్ణేశ్వరుడు ఇక్కడ కొలువుతీరి ఉన్నాడు. అజంతా ఎల్లోరా గుహల అందాలను, అక్కడి శిల్పసౌందర్యాన్ని ఓసారి పరికిద్దాం.

ఔరంగాబాద్‌కు 107 కిలోమీటర్ల దూరంలో అజంతా గుహలు ఉన్నాయి. 56 మీటర్ల ఎత్తులోని పర్వతాలమీద ఈ గుహలు పడమర నుంచి తూర్పునకు వ్యాపించి ఉంటాయి. 1819లో జాన్‌స్మిత్‌ అనే బ్రిటీషు అధికారి వీటిని గుర్తించాడు. ఇక్కడ మొత్తం 29 గుహలుంటాయి. ఆయన ఈ గుహలను ఎక్కడి నుంచైతే చూశాడో ఆ ప్రదేశాన్ని వ్యూ పాయింటుగా చెప్తారు. అక్కడి నుంచి ఈ గుహలకు గల దారి గుర్రపు నాడాలా సన్నగా కనిపిస్తుంది. చుట్టుపక్కల పరిసరాలు, అక్కడి జలపాతాలు ఎంతో అందంగా ఉంటాయి.

పెయింటింగులతో నిండి ఉండే ఈ గుహలు సందర్శకులను విశేషంగా ఆకర్షిస్తాయి. గుహల పైకప్పు, పక్కభాగాలలో బుద్ధుని జీవిత విషయాలను చిత్రీకరించారు. గోడలపై బుద్ధుని జీవిత విషయాలను వర్ణించే చిత్రాలు ఉంటాయి. ఈ చావడికి ఎడమవైపున ఉన్న హాలులో వేటగాడు పన్నిన వలనుంచి పావురాన్ని రక్షిస్తున్న శిబిచక్రవర్తి చిత్రం, జాతక కథలు ఉన్నాయి.

రెండో గుహలో బుద్ధుని పుట్టుకను చిత్రించారు. దాని పైకప్పు మీద హంసలు బారులు తీరిన దృశ్యం ఎంతో బాగుంటుంది. ఇంకా అప్పట్లో వారు వాడిన మఫ్లర్లు, పర్సులు, చెప్పులు వంటి వాటిని కూడా చిత్రించారు. 16వ నెంబరు గుహలో బుద్ధుని జీవితంలో ఎదురైన అనేక సంఘటనలను మనం చూడొచ్చు. క్రీస్తు పూర్వం 2-7 శతాబ్దాల మధ్య కాలంలో వీటిని చిత్రీకరించినట్టు చారిత్రక ఆధారాలు చెపుతున్నాయి. అప్పుడు వేసిన చిత్రాలకు గల రంగులు ఇప్పటికీ ఉండడం చిత్రంగానే ఉంటుంది.

ఎల్లోరా గుహలు
ఎల్లోరా గుహలను రాష్ట్రకూటులు, చాళుక్యుల కాలంలో చెక్కారట. ఔరంగాబాద్‌కు వాయవ్యంగా 61 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. కొండలను తొలిచి ఇంత చక్కటి అందాలను మన కోసమే తీర్చిదిద్దారా అని అనిపిస్తాయి. వీటి నిర్మాణంలో ఒక విశిష్టత ఉంది. మొదట పై అంతస్తు, అందులోని శిల్పాలను చెక్కి ఆ తరువాత కింది అంతస్తు, అక్కడి శిల్పాలు చెక్కారట. ఇక్కడ మొత్తం 34 గుహలుంటాయి.

సంభ్రమాశ్చర్యాలకు గురిచేసే ఈ గుహల అందాలు దృష్టిని మరల్చనీయవు. మొదట బౌద్ధులకు సంబంధించిన 12 గుహలు ఉంటాయి. వీటిని 5-8 శతాబ్దాల మధ్య కాలంలో చెక్కారు. 6-9 శతాబ్ద కాలంలో చెక్కినవి హిందువుల గుహలు. అవి మొత్తం 17 గుహలు. చివర్లో జైనుల గుహలుంటాయి. ఇవి 8-10 శతాబ్దాల మధ్య కాలంలో చెక్కినవి. వీటిని హెరిటేజ్‌ సైట్లుగా కూడా గుర్తించింది. అయితే వీటిలో కొన్ని శిథిలావస్థలో ఉన్నాయి.Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

పర్యాటక రంగం

భారత పక్షి సంరక్షకురాలు అపరాజితా దత్తాకు గ్రీన్ ఆస్కార్

పక్షి సమాజంలో అంతరించి పోతున్న పక్షి జాతుల సంరక్షణకు నడుం బిగించిన భారత్ యువ పక్షి ...

గుజరాత్ టూరిజంకు అమితాబ్.. బెంగాల్‌కు షారుక్

మన రాష్ట్రంలోని పర్యాటక శాఖ పర్యాటకులను ఆకర్షించేందుకు ఎలాంటి ప్రణాళికలు చేస్తుందో కానీ ...

రుషికేశ్‌లో బంగీజంప్... చేసే సాహసం మీకుందా..?!!

పర్యాటక ప్రాంతాలంటే ఎంతసేపూ ఏ ఊటీయో, కొడైకెనాలేనా? కాస్త డిఫరెంట్‌ పర్యాటకం ఏమయినా ఉంటే ...

నవనరసింహ క్షేత్రం అహోబిలం.. వీడియో

దట్టమైన అడవి, క్రూర మృగాలకు ఆలవాలంగా అహోబిలం ఉంది. అహోబిలంలో నరసింహ స్వామి కొలువై ...

Widgets Magazine
Widgets Magazine

ఎడిటోరియల్స్

ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే.. జీఎస్టీకి మద్దతిస్తాం.. కాంగ్రెస్ మెలిక.. రంగంలోకి జైట్లీ!

నాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ రాజ్యసభ సాక్షిగా ఇచ్చిన హామీల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ...

నేను చెప్పిందే జరగాలి... లేకుంటే.. మోనార్కయిపోతా..! ఎవరు..?

siva prasad

ఇప్పటివరకు సినిమాలో మోనార్క్‌ను చూశాం. కానీ రాజకీయాల్లో కూడా అలాంటి మోనార్క్ ఒకరున్నారు. అది కూడా ...

లేటెస్ట్

రియో ఒలింపిక్స్‌ 2016: ఇంద్రజీత్ సింగ్ డోపింగ్ టెస్టులో పట్టుబడ్డాడా? నాలుగేళ్ల పాటు నిషేధం?

ప్రతిష్టాత్మక రియో ఒలింపిక్స్‌కు ప్రపంచ వ్యాప్తంగా క్రీడాకారులందరూ రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో భారత ...

నర్సింగ్ యాదవ్‌పై ఏంటి వివాదం.. వివరాలివ్వండి : రెజ్లింగ్‌ సమాఖ్యకు మోడీ ఆదేశం

భారత రెజ్లర్ నర్సింగ్ యాదవ్ వివాదం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దృష్టికి చేరింది. దీంతో నర్సింగ్ యాదవ్ ...

Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine Widgets Magazine