శ్రీవిఠలుని దేవాలయం ప్రాంగణంలోనే దాదాపు 25 మందిరాలు ఉన్నాయి. ఇందులో గణేష, గరుడ, ఏకముఖ దత్తాత్రేయ, సత్యభామ, కన్హోపాత్ర వంటివి ఉన్నాయి.
వసతి దేవాలయానికి చెందిన ధర్మసత్రాలతో పాటుగా అనేక హోటెళ్లు ఇక్కడ ఉన్నాయి.
ఎలా చేరుకోవాలి విమాన మార్గం : పూణె (218 కిమీ.) రైలు మార్గం : సమీపంలో అతిపెద్ద రైల్వే స్టేషన్ షోలాపూర్ (65 కి.మీ.). మీరజ్-కురుద్‌వాడి మీటర్ గేజి మార్గంలో పంఢర్‌పూర్ రైల్వే స్టేషన్ ఉంది. కురుద్‌వాడి-పంఢర్‌పూర్ మార్గం ప్రస్తుతం బ్రాడ్‌గేజిగా మార్చారు. దీనితో షోలాపూర్-పంఢర్‌పూర్ మార్గంలో రైళ్ల రాకపోకలు నడుస్తున్నాయి. రహదారి మార్గం : మహారాష్ట్రలోని అనేక ప్రాంతాల నుంచి పంఢర్‌పూర్‌కు బస్సు సేవలు ఉన్నాయి. |