ప్రధాన పేజి   వినోదం > పర్యాటక రంగం > పుణ్య క్షేత్రాలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
నందులు పరిపాలించిన ప్రాంతం నాందేడ్
చూడవలసిన ప్రాంతాలు

గురుద్వారా
తఖ్త్ సచ్‌ఖండ్‌గా పిలిచే ఈ గురుద్వారాను మహారాణా రంజిత్ సింగ్ కట్టించారు. ఈ గురుద్వారా నిర్మాణం 1835లో పూర్తైంది. సిక్కుల పవిత్ర నాలుగు గురుద్వారాలలో నాందేడ్ గురుద్వారా ఒకటి. సిక్కుల పదవ మత గురువు గోబింద్ సింగ్. ఆయన సమాధే ఈ గురుద్వారా. గురు గోబింద్ సింగ్ వాడిన ఆయుధాలు, ఇతరాలను ఇక్కడ ఉంచారు.

మాహూర్
శ్రీ మహావిష్ణువు సోదరి పార్వతీ అమ్మవారి శక్తి పీఠాల్లో ఒకటి మాహూర్యం. వైకుంఠ నాథుడైన శ్రీమన్నారాయణ అవతారాల్లో ఒకటైన పరుశురాముడి జనని రేణుకా. రేణుకా దేవి ఇక్కడే జన్మించిందని పురాణాల్లో ప్రస్తావించారు. రేణుకా అమ్మవారి గుడిని యాదవ వంశ రాజు నిర్మించారు. ఇక్కడ అనేక దేవాలయాలు ఉన్నాయి. నాందేడ్ నుంచి 126 కి.మీ., నాగపూర్ నుంచి 250 కి.మీ. దూరంలో ఉంది మాహూర్.

నాందేడ్ కోట
గోదావరి నది ఒడ్డున ఉంది నాందేడ్ కోట. నాందేడ్ కోటకు మూడువైపులా గోదావరి నది ఉంది.

వసతి
నాందేడ్‌లో అన్నిరకాల వసతి సదుపాయాలు ఉన్నాయి.

విమాన మార్గం : హైదరాబాద్ (284 కి.మీ.) సమీపంలోని విమానాశ్రయం.
రైలు మార్గం : సికింద్రాబాద్-మన్మాడ్ మార్గంలో ఉంది నాందేడ్ రైల్వే స్టేషన్. ఇక్కడి నుంచి ముంబయి, నాగపూర్, న్యూఢిల్లీ, సికింద్రాబాద్, బెంగళూరులకు నేరుగా రైళ్లు ఉన్నాయి.
రహదారి మార్గం : మహారాష్ట్ర, ఆంధ్ర ప్రదేశ్‌లలోని వివిధ ప్రాంతాల నుంచి నాందేడ్‌కు బస్సు సేవలు ఉన్నాయి.
<< 1 | 2 
మరిన్ని
దక్షిణ కాశి పంఢర్‌పూర్
బ్రహ్మ యజ్ఞం నిర్వహించిన ప్రాంతం పుష్కర్
శక్తి పీఠాల్లో ఒకటి కామాఖ్యా దేవాలయం
ద్వాదశ జ్యోతిర్లింగం ఓంకారేశ్వర్
అమీర్ ఫోర్ట్‌కు గజరాజులపై సవారీ  
త్రిస్సూర్ పండుగలో గజరాజుల వైభవం