ఆంధ్రావని | పుణ్య క్షేత్రాలు | సముద్ర తీరాలు | పర్వత ప్రాంతాలు | అటవీ అందాలు
ప్రధాన పేజి » వినోదం » పర్యాటక రంగం » పుణ్య క్షేత్రాలు » నవబ్రహ్మలకు నిలయం.. దక్షిణ కాశీ క్షేత్రం "ఆలంపూర్" (Religious | Alampur | Srisailam | Tungabhadra River | Karnool | Mahaboobnagar | Ganga River | Kasi | Visweswara | Visalakshi | Jogulamba)
Bookmark and Share Feedback Print
 
Religious
FILE
ఈ నవబ్రహ్మ ఆలయ సముదాయంలోనే అష్టాదశ శక్తి పీఠాలలో ఒకరైన జోగులాంబను పూజిస్తుంటారు. అయితే ఈ దేవికి గతంలో ఆలయం ఉండేది కాదు. బాలబ్రహ్మేశ్వరాలయంలోనే ఒక ప్రక్కగా ఉన్న చిన్న గదిలో, ఒక గూడు వంటిది ఏర్పాటు చేసి, అందులోనే అమ్మవారిమూర్తిని ఉంచి పూజలు చేస్తూ ఉండేవారు. ఈ మధ్యనే అమ్మవారికి ప్రత్యేకంగా ఆలయం నిర్మించారు. అష్టాదశ శక్తిపీఠాలు 18లో నాలుగు మన రాష్ట్రంలోనే ఉండటం, అందులోనూ జోగులాంబ కూడా ఒకరు కావడం తెలుగువారు గర్వించదగ్గ అంశం.

ఇక్కడ 9వ శతాబ్దానికి చెందిన సూర్యనారాయణస్వామి దేవాలయం కూడా ఇదే ప్రాంగణంలో కలదు. ఇక్కడ విష్ణుమూర్తికి చెందిన సుందరమైన విగ్రహాలు కలవు. ఇంకా ఇక్కడ విజయనగర రాజు అయిన కృష్ణదేవరాయలకు చెందిన ఒక నరసింహస్వామి దేవాలయం కూడా కలదు. అలంపూర్ దగ్గరలో పాపనాశనం అను ఇరవైకి పైబడిన శివాలయములు వివిధ ఆకారం, పరిమాణాలలో కలవు. ఇందులో పాపనాశేశ్వర దేవాలయం ప్రధానమైనది.

అలాగే కుమార బ్రహ్మాలయానికి వెనుక సిద్ధుల మఠంలో ఉన్న ప్రభుత్వ పురావస్తు సంగ్రహాలయం తప్పక దర్శించాల్సిన ప్రదేశం. ఆలంపూర్‌, దాని పరిసర ప్రాంతాలలో లభించిన దేవతా మూర్తుల శిల్పాలు, శిలాశాసనాలను తెచ్చి ఈ మ్యూజియంలో భద్రపరిచారు. ఇక్కడ త్రిముఖ మహేశ్వరమూర్తి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఇంకా మహిషాసుర మర్దిని, సూర్యుడు, నటరాజు, శివమూర్తులు, నంది, భూదేవి, కార్తికేయుడు, వీరగల్లులు ఇత్యది మూర్తులు చెప్పుకోదగినవి.

శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణ సందర్భంగా కృష్ణానదిలో ముంపుకు గురవుతున్న సంగమేశ్వరాలయాన్ని పునాదులతో సహా ఒక్కోక్కరాయిని తొలగించి ఆలంపూర్‌లోని వేరొక ప్రదేశంలో యథాతథంగా నిర్మించారు. ఇలా పునర్నిర్మించిన ఆలయాల్లో సంగమేశ్వరాలయం ప్రపంచంలోనే రెండవది కావడం విశేషంగా చెప్పవచ్చు.

ఆలంపూర్ ఎలా వెళ్లాలంటే.. హైదరాబాద్ నుంచి నేరుగా ఆలంపూర్ చౌరస్తాకు కర్నూలు మార్గంలో 210 కిలోమీటర్ల దూరం బస్సులో ప్రయాణించాలి. చౌరస్తా నుంచి నుంచి ఆలంపూర్ 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అదే కర్నూలు నుంచయితే ముప్పై కి.మీ. దూరంలో ఉండే ఆలంపూర్‌కు ప్రతి అరగంటకు బస్సులు అందుబాటులో ఉంటాయి. ఆలంపూర్ చౌరస్తా నుంచి 6 రూపాయలు, హైదరాబాదు నుంచి 110 రూపాయలు ప్రయాణ ఛార్జీలుంటాయి.

ఇక బస విషయానికి వస్తే.. ఆలంపూర్‌ చిన్న ఊరు కాబట్టి వసతి సౌకర్యాలు తక్కువగా ఉంటాయి. కర్నూలు నుంచి వచ్చి ఆలంపూర్‌ను దర్శించుకుని తిరిగి కర్నూలు వెళ్లి అక్కడే బస చేయాల్సి ఉంటుంది.
 
సంబంధిత సమాచారం కోసం శోధించండి.