ఆస్ట్రేలియాలోని ప్రాంతాలను సందర్శించే వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఆస్ట్రేలియాలో అత్యంత పేరుగాంచిన నగరాల్లో మెల్‌బోర్న్ రెండవది. ఈ దేశంలోని నగరాలన్నింటిలోకెల్లా.. మెల్‌బోర్న్ నగరాన్ని చూడటానికి యాత్రికులు అధికంగా ఇష్టపడుతారు. అక్కడి వాతావరణం, ప్రకృతి ఎంతగానో పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఇలాంటి మెల్‌బోర్న్‌లో చూడదగిన ప్రదేశాల్లో ప్రధానంగా క్వీన్స్‌ల్యాండ్, ల్యామ్నింటన్ నేషనల్ పార్కు, రాయల్ బొటానిక్ గార్డెన్, ఆక్వేరియంలు ముందు వరుసలో ఉంటాయి. ఇది విక్టోరియా రాష్ట్రానికి ముఖ్య పట్టణం. ఇక్కడ 3.8 మిలియన్ ప్రజలు నివసిస్తున్నారు. ఈ నగరానికి పక్కన యర్రానది ఉంది. ఈ నగరం పరిశ్రమలకు, సాంస్కృతిక కార్యక్రమాలకు ముఖ్య కేంద్రంగా మారింది. ఆస్ట్రేలియా క్రీడలకు, సంస్కృతికి ముఖ్య పట్టణంగా మెల్‌బోర్న్‌ని గుర్తించారు. ఇక్కడ సమాజం భిన్న సాంప్రదాయాలకు వేదికగా ఉంది. ఇది అనేక అంతర్జాతీయ సదస్సులకు, కార్యక్రమాలకు ఆతిథ్యం ఇచ్చింది. ఆతిథ్యం ఇచ్చిన కార్యక్రమాల్లో 1956 సమ్మర్ ఒలింపిక్స్, 2006 కామెన్‌వెల్త్ గేమ్స్‌లను ప్రధానంగా చెప్పుకోవచ్చు. |