ఆంధ్రావని | పుణ్య క్షేత్రాలు | సముద్ర తీరాలు | పర్వత ప్రాంతాలు | అటవీ అందాలు
ప్రధాన పేజి » వినోదం » పర్యాటక రంగం » సముద్ర తీరాలు » "గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్" భవనం "కోకొనట్ లాగూన్" (Tourism | sea beach | coconut lagoon heritage resort | kerala | arundhati roy)
 
FILE
సముద్ర గర్భాన్ని చీల్చుకుని వెలుపలికి వస్తున్నట్లుగా కడిగిన ముత్యంలా ప్రకాశించే సూర్య భగవాగవానుడి లేలేత కిరణాల హొయలు, ఆ ఆదిత్యుడికి స్వాగతం పలికే పక్షుల కిలకిలారావాలు, ఈ సుందర దృశ్యాలను ప్రతిబింబిస్తూ మురిసి మెరిసిపోయే సముద్ర అలలు.. గాలి తాకిళ్లను తట్టుకుని ముందుకు దూకే పడవలు, వాటిలోని జాలర్లు, పసిపిల్లల కేరింతల్లా చప్పుడుచేసే కొబ్బరాకుల గలగలలు... ఇంతటి ప్రకృతి సౌందర్యాన్ని తనలో దాచుకున్న అద్భుతమైన ప్రాంతమే కేరళ.

సముద్ర జలాలతో ఏర్పడిన సరస్సులు, నదులు, పిల్లకాలువలు కలగలసి... కేరళ రాష్ట్రానికి దేశంలోనే అందమైన ప్రాంతంగా గుర్తింపు తెచ్చాయి. పశ్చిమ కనుమలలోని కార్డమమ్ హిల్స్ నుండి కనీసం 40 నదులు కేరళ గుండా ప్రవహించి అరేబియా సముద్రంలో కలుస్తుంటాయి.

కేరళలో సరస్సులున్న ప్రాంతాలను "కుట్టునాడు" అని అంటుంటారు. కుట్టునాడు అంటే... పొట్టివాళ్ళు ఉండే ప్రదేశం అని అర్థం. ఇక్కడి రైతులు ఎప్పుడూ సాగుభూముల్లో మోకాలిలోతు కూరుకుపోయి పంట పనులు చేయటం వల్ల బహుశా ఆ ప్రాంతాలకు ఆ పేరు వచ్చి ఉంటుంది. శతాబ్దాలుగా ఈ ప్రాంతంలో ఫలసాయాలు, కొబ్బరి ఉత్పత్తులు, ఇతర వస్తువుల రవాణాకు మళయాళీలు ఈ నదులపైనే ఆధారపడ్డారు.
ఆకట్టుకునే పురాతన భవనాలు
కేరళ సంప్రదాయసిద్ధమైన ధారవాడ నిర్మాణశైలిలో నిర్మించిన విడి కాటేజీలు కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయి. ఈ కాటేజీలన్నీ పురాతనమైన భవనాలు కావడంతో చూపరులను విశేషంగా ఆకట్టుకుంటాయి. ప్రపంచ ప్రఖ్యాత రచయిత్రి అరుంధతీరాయ్‌కి బుకర్ ఫ్రైజును తెచ్చిపెట్టిన...


అందుకేనేమో... ఇప్పటికీ ఆయా లంకల్లోని మళయాళీలకు పడవలే రవాణా సౌకర్యాలు. పాఠశాలలకు పిల్లల్ని తీసుకెళ్లటం, తీసుకురావటం లాంటి వాటితో సహా ప్రజలు దైనందిన కార్యకలాపాలలో పడవ ప్రయాణాలు సర్వసాధారణం. ఈ తీర ప్రాంతాలలో విహారం ఓ అనిర్వచనీయమైన అనుభూతిని అందిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి ఇంత అందమైన ప్రకృతి దృశ్యాలను చూడాలంటే "కోకొనట్ లాగూన్ రిసార్ట్"కు వెళ్ళాల్సిందే మరి..!

కేరళలోని కొట్టాయం పట్టణానికి పది కిలోమీటర్ల దూరంలో ఉండే కోకొనట్ లాగూన్ రిసార్ట్.. కోచ్చి నుంచి 78 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దట్టమైన పామ్ చెట్ల మధ్యలో.. వెంబనాడ్ సరస్సు తూర్పుతీరంలో కవనార్ నదీ ముఖద్వారం వద్ద ఈ కోకొనట్ లాగూన్ రిసార్ట్ వెలసింది.

కుట్టునాడ్ ప్రజల జీవనశైలిని ప్రతిబింబిస్తూ, చక్కటి సరస్సులు, నదులు కలగలసి ఉన్న ఈ ప్రదేశంలోని కోకొనట్ లాగూన్ హెరిటేజ్ రిసార్ట్... పచ్చని చీరను చుట్టుకున్నట్లుగా ప్రకృతి తన అందాలతో అలరింపజేస్తుంది. కేరళ సంప్రదాయసిద్ధమైన ధారవాడ నిర్మాణశైలిలో నిర్మించిన విడి కాటేజీలు కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయి. ఈ కాటేజీలన్నీ పురాతనమైన భవనాలు కావడంతో చూపరులను విశేషంగా ఆకట్టుకుంటాయి.

ప్రపంచ ప్రఖ్యాత రచయిత్రి అరుంధతీరాయ్‌కి బుకర్ ఫ్రైజును తెచ్చిపెట్టిన "గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్"లో పేర్కొన్న కోకొనట్‌ లాగూన్‌ రెస్టారెంట్‌.. ఇప్పుడు మనం తెలుసుకుంటున్న కోకొనట్ లాగూన్ రిసార్ట్‌లోని ఒక పురాతన భవనం కావడం విశేషం. ఇది అద్భుతమైన కేరళ వంటకాలకు ప్రసిద్ధి చెందినది.
 
• Play Free Online Games Click Here
• Blogs, Videos and More Click Here
• Send Musical and Animated Cards Click Here
• Simple,Fast & Free Email Service Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.