ప్రధాన పేజి > వినోదం > పర్యాటక రంగం > అటవీ అందాలు > ప్రకృతి రమణీయతకు నిలయం... కంబాలకొండ
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ప్రకృతి రమణీయతకు నిలయం... కంబాలకొండ
నగరజీవితంలో విసిగి వేశారిన జీవితాలకు ఎక్కడికైనా వెళ్లి కొంతసేపు ప్రకృతి ఒడిలో సేదతీరాలని అనిపించడం మామూలే. నగరంలోని రణగొణ ధ్వనులనుంచి స్వచ్ఛమైన ప్రకృతిని ఆస్వాదించగలిగే అలాంటి ప్రదేశాన్ని సందర్శించే ఛాన్స్ వస్తే ఎవరైనా ఎగిరి గంతేస్తారు.

అలా ప్రకృతి రమణీయతతో సింగారించుకున్న ఓ చక్కటి ప్రదేశం ఏదీ అంటే విశాఖపట్నంకు సమీపంలో ఉన్న కంబాలకొండ అంటూ నిస్సందేహంగా చెప్పవచ్చు. అటవీప్రాంతంలో పర్యాటకుల కోసం దాదాపు 80 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేసిన ఎకో టూరిజం ప్రదేశం పర్యాటకులకు సిసలైన ప్రకృతి అనుభూతిని అందిస్తూ వస్తోంది.

గిరిజనులచే నిర్వహించబడుతోన్న ఈ టూరిజం స్పాట్ చక్కని ప్రకృతి ప్రదేశానికి నిలయంగా ఉంటోంది.

కంబాలకొండ విశేషాలు
పర్యాటకులు వివరించేందుకు, తిలకించేందుకు వీలుగా ఈ కంబాలకొండ టూరిజం ప్రదేశంలో ఎన్నో సౌకర్యాలున్నాయి. ఈ టూరిజం ప్రదేశంలో ఉన్న నెమళ్లు, కుందేళ్లు, చిరుతలు, పాల పిట్టలు లాంటివి పర్యటకుల మనసు దోచేసుకుంటాయి. అలాగే ఈ ప్రదేశంలో పర్యాటకులు తనివితీరా ఆనందించడానికి వీలుగా రివర్ క్రాసింగ్, బోటింగ్ సౌకర్యాలతో పాటు ట్రెకింగ్ కూడా అందుబాటులో ఉన్నాయి.

సంబంధిత సమాచారం కోసం శోధించండి.
1 | 2  >>  
మరిన్ని
వన్యమృగాలకు నిలయం సరిస్కా జాతీయ పార్కు
ప్రకృతి అందాలకే అందం అరకు సౌందర్యం
హాయిగోలిపే హార్సీలీ హిల్స్
జర్మనీ సఫారీ పార్క్‌లో తెల్ల సింహపు పిల్లలు  
పన్నా పులుల సంరక్షణా కేంద్రం
కనిష్కుడి కాలం నాటి కోట ఖిలా ముబారక్