ప్రధాన పేజి > వినోదం > పర్యాటక రంగం > అటవీ అందాలు > "బి.ఆర్. కొండల" అపురూప ప్రకృతి గానం
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
"బి.ఆర్. కొండల" అపురూప ప్రకృతి గానం
FILE

చుట్టూ ఆకుపచ్చని గడ్డి మైదానాలు, అగాధాల్లాంటి లోయలు, నీలాకాశం, ఎత్తయిన కొండలు, వాటిపై చిక్కగా అల్లుకున్న వనాలు, వాటినిండా పూలు, పండ్ల వృక్షాలు, చల్లటి గాలి.... ఇలాంటి వాతావరణం మనసుల్ని దోచుకోవాలంటే అట్టే సమయం పట్టదు. ఇంతటి ఆహ్లాదకరమైన ప్రాంతానికి అలా ఎగురుకుంటూ వెళ్లిపోవాలని అనిపిస్తోంది కదూ...! అయితే మైసూరుకు దగ్గర్లో ఉండే "బి.ఆర్. హిల్ స్టేషన్‌"కు వెళ్దాం పదండి..!

ఈ బి.ఆర్. కొండల మాటున ఉండే అభయారణ్యం ఒకప్పుడు అడవిదొంగ వీరప్పన్ రహస్య స్థావరంగా ఉండేది కాబట్టి, పర్యాటకులు అటువైపు వెళ్లాలంటేనే భయపడేవారు. వీరప్పన్ మరణం తరువాత ఇప్పుడిప్పుడే వన్యప్రాణి అభిమానులు, ప్రకృతి ప్రేమికులు ఈ అరుదైన సహజ ఉద్యానవనాలను సందర్శిస్తున్నారు.
పక్షుల కిలకిలలు... వన్యప్రాణుల విహారాలు...!!
  లోతైన లోయలు, ఎత్తైన కొండల అంచుల మీదుగా, దట్టమైన అడవి గుండా సాగే యాత్ర, ప్రకృతి ప్రేమికులకు ఒక అద్వితీయ అనుభూతిని ఇస్తుంది. ఎప్పుడు ఏ పొదల నుండి ఏ వన్యజీవి, మృగం వస్తుందో తెలియని ఉద్విగ్న పరిస్థితిలో ప్రయాణం సాగుతుంది...      


దక్షిణ భారత దేశంలో అటు పశ్చమ కనుమలకు, ఇటు తూర్పు కనుమలకు మధ్యనుండే కర్ణాటక ప్రాంతంలో విస్తరించినవే బి.ఆర్. కొండలు. ఆకురాల్చే సతత హరిత, గడ్డి మైదాన అడవులకు ఈ కొండలు ప్రసిద్ధిగాంచాయి. ఏ కొండల గుండె రాగమైనా ఒక అపురూప అనుభవమే అన్నట్లుగా... ఇక్కడి స్వచ్ఛమైన ప్రకృతి కల్మషం లేని హృదయంలాగా అందరికీ ఆహ్వానం పలుకుతుంటుంది.

మైసూరుకు 90 కిలోమీటర్ల దూరంలో నెలకొని ఉన్న ఈ బి.ఆర్. కొండలు దేశంలోని ప్రముఖ అభయారణ్యాలలో ఒకటిగా పేరుగాంచాయి. సముద్ర మట్టానికి 5,091 అడుగుల ఎత్తులో, సుమారు 500 చదరపు మీటర్ల మేర విస్తరించి ఉన్న ఈ వనాలలో దాదాపు 270 రకాల వృక్ష జాతులున్నాయి. ఈ అరణ్యంలో సుసంపన్నమైన పుష్ప, ఫల, వృక్ష సంపదకయితే కొదవేలేదు.

ఏనుగుల నివాసానికి ఇదో ఆదర్శ ప్రాంతమని చెబుతుంటారు కూడా.. ఆసియా ఏనుగులు, పులులు చిరుతలకు బి.ఆర్. కొండలు ప్రసిద్ది. ఎక్కడ చూసినా పక్షుల కిలకిలారావాలు, వన్యజీవుల విహారాలు పర్యాటకులకు కనువిందు చేస్తుంటాయి. రాష్ట్ర అటవీశాఖ సందర్శకులకోసం ప్రత్యేక కాటేజీలను అడవి మధ్యలో ఏర్పాటు చేసింది. అక్కడి దాకా జీవులలో వెళ్ళవచ్చు.
1 | 2 | 3  >>  
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
చెన్నపురి విహంగాల విడిది "అడయార్ పార్క్"
నిర్లక్ష్యం నీడలో "జవదు కొండలు"
అంతరిస్తున్న పులులు... రాత్రుల్లో ఎన్‌హెచ్-67పై నిషేధం..!
నేను చెట్టును...!
ప్రకృతి ఒడిలో "రంగనతిట్టు పక్షి ధామం"
ఔరా అనిపించే... "ఉదకమండల" అందాలు