ప్రధాన పేజి > వినోదం > పర్యాటక రంగం > అటవీ అందాలు > వెండిమబ్బుల స్వాగతాన్నిచ్చే "చిరపుంజి"
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
వెండిమబ్బుల స్వాగతాన్నిచ్చే "చిరపుంజి"
FILE
నేలపై పచ్చటి తివాచీ పరచినట్లుగా ఉండే చెట్లు, మొక్కలు.. ఆకాశంలో వెండి మబ్బులు, మధ్యమధ్యలో ఆ మబ్బుల చాటునుంచి బయటకు వచ్చే సూరీడు... ఇలా ఎన్నో ప్రత్యేకతలను కలిగి ఉన్న ప్రాంతం "చిరపుంజి". మేఘాలయా రాష్ట్రంలోని ఈ ప్రాంతం ప్రపంచంలోనే అతి ఎక్కువ వర్షపాతం నమోదయ్యేదిగా గిన్నిస్‌బుక్ రికార్డుల్లోకి కూడా ఎక్కింది.

ప్రకృతి అంతా తరలివచ్చి ఇక్కడే ఇల్లు కట్టుకుని ఉండిపోయిందా అన్నట్లుగా అనిపించే ఈ చిరపుంజిలో ఎటు చూసినా పచ్చటి లోయలు, మధ్యలో జలపాతాలతో కనువిందు చేస్తూ ఉంటుంది. కొన్నిసార్లు మేఘాలతో సహజీవనం చేసే ఆ ప్రాంత ప్రజలు ఎంత అదృష్టవంతులో కదూ..? అని కాస్త అసూయగా కూడా అనిపిస్తుంది.
బ్రిటీష్‌వాళ్లు పారిపోయారట..!
  ఇక్కడి వాతావరణంలో బ్రిటీష్‌వారు ఇమడలేకనే తిరిగి వారి దేశానికే వెళ్లిపోయారంటూ.. ఇక్కడి స్థానిక కాశీ తెగ గిరిజనులు చమత్కరిస్తుంటారు కూడా..! అయితే ఈ ప్రాంతాన్ని ప్రపంచానికి తొలిసారిగా పరిచయం చేసిన ఘనత మాత్రం బ్రిటీషువారికే దక్కుతుంది...      


ఏడాది పొడవునా చిరపుంజిలో వర్షాలు పడుతూనే ఉన్నా.. జూన్, జూలై, ఆగస్టు మాసాలలో మాత్రం వర్ష తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే చిరపుంజి అందాలను ఈ సమయంలోనే చూడాలని చెబుతుంటారు స్థానికులు. సముద్ర మట్టానికి దాదాపు 1290 అడుగుల ఎత్తులో ఉండే ఈ ప్రాంతంలో వానాకాలం మొత్తంమీదా దాదాపు పన్నెండువేల మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవుతుంటుంది.

ఈ చిరపుంజి సందర్శించేవారు తప్పనిసరిగా చూడాల్సిన ప్రాంతం "మాక్టో వ్యాలీ". ఈ వ్యాలీకి వెళ్లేందుకు పచ్చని కొండల నడుమ నల్లటి తాచులా వెళ్లే సన్నటి రోడ్డుపై ప్రయాణిస్తుంటే కలిగే అనుభూతిని స్వయంగా అనుభవించాల్సిందే. మాక్టో వ్యాలీ నుంచి సోహ్రా పట్టణంలోకి అడుగుపెట్టాలంటే, ఒక దట్టమైన అడవిని దాటాల్సి ఉంటుంది. ఇక్కడ గిరిజన విద్యార్థుల కోసం రామకృష్ణమఠం ఒక ఉన్నత పాఠశాలను కూడా ప్రారంభించింది.

సోహ్రా పట్టణానికి కొద్ది కిలోమీటర్ల దూరంలో ఉండే "నాంగ్‌స్లావియా" అనే ప్రాంతంలో కాశీ లిపి పుట్టినట్లుగా చెబుతుంటారు. ఇక్కడి సూర్యోదయం పర్యాటకులకు మధురానుభూతులను కలుగజేస్తుందంటే అతిశయోక్తి కాదు. వర్షం కురిసి చల్లగా ఉన్న వాతావరణంలో సూర్యుడి లేలేత కాంతి కిరణాలు మనసుకు చెప్పలేనంత ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. పర్యాటకులు కొండ శిఖరాల పైనుంచి లోయల్లోకి దూకుతున్న జలపాతాలను చూస్తూ... తమ ఉనికినే మర్చిపోయేంతగా లీనమైపోతుంటారు.

ఇదిలా ఉంటే... చిరపుంజిని స్థానికంగా సోహ్రా అని పిలుస్తుంటారు. అంటే పండ్లు పండని ప్రాంతం అని అర్థం. ఈ సోహ్రా పట్టణంలో వారాల తరబడీ వర్షాలు కురుస్తూనే ఉంటాయి. ఇక్కడి వాతావరణంలో బ్రిటీష్‌వారు ఇమడలేకనే తిరిగి వారి దేశానికే వెళ్లిపోయారంటూ.. ఇక్కడి స్థానిక కాశీ తెగ గిరిజనులు చమత్కరిస్తుంటారు కూడా..! అయితే ఈ ప్రాంతాన్ని ప్రపంచానికి తొలిసారిగా పరిచయం చేసిన ఘనత మాత్రం బ్రిటీషువారికే దక్కుతుంది.
1 | 2  >>  
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
మృగరాజుల స్థావరం "గిర్ అభయారణ్యం"
ఆద్యంతం థ్రిల్లింగ్‌నిచ్చే "శేషాచలం" ట్రెక్కింగ్...!!
"బి.ఆర్. కొండల" అపురూప ప్రకృతి గానం
చెన్నపురి విహంగాల విడిది "అడయార్ పార్క్"
నిర్లక్ష్యం నీడలో "జవదు కొండలు"
అంతరిస్తున్న పులులు... రాత్రుల్లో ఎన్‌హెచ్-67పై నిషేధం..!