2002 సంవత్సరంలో వలస వచ్చిన ఫ్లెమింగో పక్షుల సంఖ్య 30,000 కాగా, గత సంవత్సరం ఆ సంఖ్య 7,000 కు పడిపోయిందని, సగటున వలస పక్షుల సంఖ్య 50 శాతానికి తగ్గిపోయిందని రామలింగం వెల్లడించారు.
వలస పక్షుల సంఖ్య పడిపోవడం మరియు జలజీవాలు తగ్గిపోవడానికి సరస్సులో ఇసుకు మేట వేయడమే ప్రధాన కారణంగా ఆయన అన్నారు. చేపలు పట్టేవాళ్లు రెండు మి.మీ.ల వెడల్పు రంధ్రాలను కలిగిన వలలను ఉపయోగించడం కూడా జల జీవాల సంఖ్య తగ్గడానికి ఒక కారణంగా తెలిపారు.
అదేసమయంలో సరస్సు ఆక్రమణలకు గురవుతున్నదనే అంశాన్ని ఆయన తోసి పుచ్చారు. ఇటీవల కేటాయించిన 800 ఎకరాలలోని పట్టాలను ప్రభుత్వం రద్దు చేసిన సంగతిని రామలింగం ప్రస్తావించారు.
ఇరాన్‌లోని రమ్‌సర్ చిత్తడి ప్రాంతాన్ని ఇటీవల జరిగిన అంతర్జాతీయ సదస్సు రక్షిత ప్రాంతంగా గుర్తించిన తీరుగా, కేంద్ర ప్రభుత్వం పులికాట్ సరస్సును పరిగణనలోకి తీసుకోవాలని ఆయన కోరారు. ఈ మేరకు ఒక వినతి పత్రాన్ని కేంద్రానికి పంపనున్నట్లు వెల్లడించారు.
|