ప్రధాన పేజి   వినోదం > పర్యాటక రంగం > ఆంధ్రావని
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
పర్యాటక కేంద్రాల నెలవు తిరుపతి  Search similar articles
తిరుపతి పేరు తెలియనివారు దేశంలోనే ఉండరంటే అతిశయోక్తి కాదేమో. కలియుగ ప్రత్యక్షదైవం శ్రీవేంకటేశ్వరుడు వెలసిన దివ్యక్షేత్రం తిరుమల పాదాల చెంత వెలసిన తిరుపతి పట్టణం నిత్యం భక్తులు, పర్యాటకులతో కళకళలాడుతుంటుంది. అయితే తిరుపతికి విచ్చేసిన చాలామంది తిరుమలలోని స్వామివారిని దర్శించుకుని వెళ్లిపోతుంటారు.

అయితే ఓ రోజు కేటాయించి తిరుపతిలో విహరించగల్గితే ఎన్నో దేవాలయాలు, మరెన్నో పర్యాటక ప్రదేశాలు మనకు మరింత ఆనందాన్ని పంచిపెడుతాయి. అందుకే తిరుపతిలో చూడదగ్గ కొన్ని ముఖ్య ప్రదేశాలను ఇక్కడ వివరిస్తున్నాం.

తిరుపతిలో ముఖ్యమైన దేవాలయాలు
తిరుపతిలో ముఖ్యమైన దేవాలయాలుగా గోవిందరాజస్వామి ఆలయం, కపిలతీర్థం, తిరుచానూరులను చెప్పుకోవచ్చు. తిరుమలకు విచ్చేసిన భక్తుల్లో అధికభాగం ఈ మూడు క్షేత్రాలను దర్శించడానికి సైతం అత్యంత ఆసక్తి కనబరుస్తుంటారు.

కపిలతీర్థం
తిరుపతిలోని ప్రధాన బస్‌ స్టేషన్ నుంచి తిరుమలకు వెళ్లే దారిలో దాదాపు మూడు కిలోమీటర్ల దూరంలో కపిలతీర్థం ఉంది. ఇక్కడ శివుడు కపిలేశ్వరుని రూపంలో కొలువై ఉన్నారు. అంతేకాకుండా ఇక్కడ ఓ జలపాతం సైతం ఉంది. పైనుంచి జాలువారే జలపాతంలో తనివితీరా స్నానం చేసి అటుపై శివుని దర్శించడం భక్తుల ఆనవాయితీ.

అలాగే విశాలమైన ఈ క్షేత్రంలో శివునితోపాటు ఇతర దేవతలు కూడా కొలువైఉన్నారు. ఇక్కడ యాత్రికులు విశ్రమించడానికి అనువుగా ఉద్యానవనం కూడా ఉంది.

గోవిందరాజస్వామి ఆలయం
తిరుపతిలో యాత్రికులు తప్పకుండా దర్శించాల్సిన మరో ఆలయం గోవిందరాజ స్వామి ఆలయం. వెంకటేశ్వర స్వామికి అన్నగా పేర్కొనే గోవిందరాజస్వామి ఇక్కడ కొలువై ఉన్నారు. శయానాకారంలో ఉండే గోవిందరాజస్వామి దివ్యమంగళ స్వరూపం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది.

1 | 2  >>  
మరిన్ని
ప్రకృతి అందాల నిలయం బొర్రా గుహలు
ఏకశిలా విగ్రహాల తోరణం ఉండవల్లి
భారతావనికి ఆదర్శ గ్రామం.. గంగదేవిపల్లి  
విదేశీ పక్షుల రాకతో పులకించి పోతున్న గ్రామస్థులు  
పర్యాటక కేంద్రంగా లక్నవరం చెరువు  
పర్యాటక కేంద్రంగా వరంగల్