ఆంధ్రావని | పుణ్య క్షేత్రాలు | సముద్ర తీరాలు | పర్వత ప్రాంతాలు | అటవీ అందాలు
ప్రధాన పేజి » వినోదం » పర్యాటక రంగం » ఆంధ్రావని » కాఫీ తోటల సుమధుర పరిమళాల "అనంతగిరి" (AP Tourism | Andhra Pradesh | Hill Station | Ananthagiri | Visakhapatnam | Forests | Water Falls | Coffee Plants)
Bookmark and Share Feedback Print
 
Park
PTI
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని హిల్ స్టేషన్లలో ఒకటి అరకు "అనంతగిరి". ఇది విశాఖపట్నానికి 40 కిలోమీటర్ల దూరంలోనూ, రాష్ట్ర రాజధాని నగరం హైదరాబాదుకు 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రశాంతమైన ప్రకృతి నడుమ దట్టమైన అడవులు, పచ్చని చెట్లు, ముగ్ధ మనోహర దృశ్యాలతో రంజింపజేసే ఈ ప్రాంతం ప్రకృతి ప్రేమికులకు ఓ సరికొత్తలోకంలోకి తీసుకెళ్తుంది. అనంతగిరిలో వాతావరణం ఎల్లప్పుడూ చల్లగా, కమనీయంగా ఉండటంతో సంవత్సరంలో ఏ కాలంలో అయినా అక్కడికి వెళ్లవచ్చు.

మేఘాలను తాకే కొండలు, ఆ కొండలపై పచ్చని చెట్ల సోయగాలు, ఏటవాలుగా ఉండే కనుమలు, లోయలు, జలపాతాలు పర్యాటకులను రంజింపజేస్తాయి. ముఖ్యంగా కొత్తగా పెళ్లయిన జంటలకు ఈ ప్రదేశం ఓ స్వర్గ సామ్రాజ్యమంటే అతిశయోక్తి కాదు. అరకు లోయకు 17 కిలోమీటర్ల దూరంలో, అక్కడి తిరుమల హిల్స్ పై భాగంలోని తూర్పు కనుమల్లో భాగంగా ఈ ప్రదేశం పర్యాటకుల మనసును దోచుకుంటోంది.

తిరుమలగిరికి వెళ్లేందుకు ఘాట్ రోడ్డులలో చేసే ప్రయాణం అద్భుతంగా ఉంటుంది. ముక్కుపుటాలు అదిరిపోయేలా సుగంధ పరిమళాలను మోసుకొచ్చే కాఫీ తోటలు ఓవైపు, రకరకాల పండ్ల అలరించే పళ్లతోటలు మరోవైపు మనసును ఆనంద డోలికల్లో ముంచెత్తివేస్తాయి. ఈ ప్రాంతంలో కాఫీ తోటలు, పళ్ల తోటలు మాత్రమే కాకుండా వన మూలికలు కూడా లభ్య మవుతుంటాయి.

ముఖ్యంగా తిరుమలగిరిలోని భవనాశి సరస్సును పవిత్ర తీర్థంగా పర్యాటకులు సేవిస్తుంటారు. ఈ సరస్సు వల్లనే ఈ ప్రాంతానికి దక్షిణ బద్రీనాథ్‌గా పేరు వచ్చిందని స్థానికులు చెబుతుంటారు. అలాగే అనంతగిరి నుంచి ముచికుందా నది పాయలుగా చీలి వేగంగా పరుగులు తీస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది.
 
సంబంధిత సమాచారం కోసం శోధించండి.