ప్రధాన పేజి   వినోదం  టీవీ టైమ్  వార్తలు
 
కొత్త చిత్రంతో అజయ్ దర్శకావతారం
ప్రముఖ బాలివుడ్ నటుడు అజయ్ దేవ్‌గన్ తన సహజ నటనతో అందరినీ మెప్పించి, నవ్వించి ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించాడు. ప్రస్తుతం దర్శకత్వ రంగంపై తన దృష్టి సారిస్తున్నాడు.

యు మే అవుర్ హమ్ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో అజయ్ దేవగన్, అతని భార్య కాజోల్, సుమీత్ రాఘవన్, కరణ్ కన్నా, ఈషా శర్వాణీ తదితరులు నటిస్తున్నారు. కథను రాబిన్ భట్, సుతాను గుప్తా, అకర్ష్ కురానాలు రచించగా, అశ్వాని ధీర్ సంభాషణలు అందిస్తున్నారు. సంగీతం విషాల్ భరద్వాజ్‌ అందిస్తుండగా, పాటలు మున్నా ధీమన్, దుస్తులను అన్నా సింగ్, మనీష్ మల్హోత్రాలు సమకూరుస్తున్నారు.

ఈ చిత్ర ప్రారంభం ఏప్రిల్ 30న అంధేరీలోని మనోరంజన్ స్టూడియోలో జరిగింది. మొదటి విడత షూటింగ్ మే5న జరుగనుంది. 2008 జనవరిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. చివరిగా అజయ్ నటించి విడుదలైన చిత్రాలు ఓంకారా, గోల్‌మాల్ చిత్రాలు విజయవంతమయ్యాయన్నది గమనార్హం.