బాలీవుడ్ నటి శిల్పాశెట్టి, హలీవుడ్ నటుడు రిచర్డ్ గెరెల ముద్దు వివాదానికి సంబంధించిన కేసు విచారణను స్థానిక కోర్టు మే 26కు వాయిదా వేసింది. శనివారం జరిగిన విచారణ సందర్భంగా కోర్టుకు హాజరు కాని శిల్పకు ఖైదు వారెంటు జారీ చేయాల్సిందిగా ఫిర్యాదు దారుడు విజ్ఞప్తి చేశాడు.
ఈ కేసుకు సంబంధించి విచారణ చేపడుతున్న అడిషనల్ చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ దినేష్ కుమార్ గుప్తా, గెరెపై అరెస్టు వారెంటు జారీ చేశారు. దీనితో పాటు ఈ కేసు విచారణ సంబంధించి మే 5న కోర్టుకు హాజరుకావాలని శిల్పకు సమన్లు పంపించారు.
బహిరంగ ప్రదేశంలో అసభ్యంగా ప్రవర్తించినందుకు శిల్పశెట్టికి వ్యతిరేకంగా న్యాయవాది పూనం చాంద్ బందారీ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసును విచారిస్తున్న జస్టిస్ గుప్తా కిషన్‌గర్‌కు బదిలీ అయినందున మెజిస్ట్రేట్ రాజేష్ టుతేజా విచారణ చేపట్టారు. అయితే ఈ కేసు క్షుణ్ణంగా పరిశీలించేందుకు సమయం కావాలని, అందుచే ఈ కేసు విచారణను మే 26కు వాయిదా వేస్తున్నట్టు మెజిస్ట్రేట్ రాజేష్ తెలిపారు.
|