ప్రధాన పేజి   వినోదం  టీవీ టైమ్  వార్తలు
 
తమిళనాడు సీఎంను కలిసిన రాడాన్ రాధిక
కలైంజర్ టీవీ ఛానల్‌కు సీరియళ్లు నిర్మించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని రాడాన్ టీవీ అధినేత్రి, ప్రముఖ సినీ తార, టెలివిజన్ సీరియల్ నిర్మాత రాధికా శరత్ కుమార్ వెల్లడించారు. ఇప్పటి వరకు ఆమె సన్ టీవీ నెట్‌వర్క్‌కు పలు కుటుంబ కథా సీరియళ్లను అందించిన విషయం తెలిసిందే.

అటువంటి కార్యక్రమాలనే ఆగస్టు 15న ప్రారంభమయ్యే కలైంజర్ టీవీ ఛానల్‌కు అందించే అంశాన్ని పరిశీలిస్తున్నానని ఆమె తెలిపారు. ఆ అంశంపై ముఖ్యమంత్రి కరుణానిధితో మంగళవారం ఆమె సమావేశం జరిపారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ ఈ అంశంపై కరుణానిధి తనతో చర్చించారని ప్రకటించారు.