ప్రధాన పేజి   వినోదం > టీవీ టైమ్ > వార్తలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
శ్రీవెంకటేశ్వర భక్తి టీవీ ఛానెల్ కోసం సీరియల్స్
త్వరలో ప్రారంభం కానున్న శ్రీవెంకటేశ్వర భక్తి టీవీ ఛానెల్ కోసం భక్తి రస కథలను కీలకంగా ఎంచుకుని మూడు సీరియల్స్ రూపొందతున్నాయి.. ప్రస్తుతం ఈ సీరియల్స్ రామానాయుడు స్టూడియోలో షూటింగ్ జరుపుకుంటున్నాయి.. వీటికి.. పురాణ గాథలు, శాస్త్రం శాస్త్రం, నా కిష్టం ఎందుకంటే... అన్న సీరియల్స్‌ను రూపొందిస్తున్నారు.

ప్రముఖ సినీ దర్శకులు ఎ కోదండరామిరెడ్డి తొలిసారిగా స్వీయ దర్శకత్వంలో బుల్లి తెరపై పురాణ గాథలు అన్న సీరియల్‌ను చిత్రీకరిస్తున్నారు. ఇటీవలే ఈ సీరియల్‌ను రామానాయుడు స్టూడియోలో ప్రారంభించారు.. ఈ సీరియల్‌కు కథ, మాటలు డి సురేష్ కుమార్ అందిస్తుండగా... నాగరాజ్, మాధవపెద్ది సురేష్‌లు సంయుక్తంగా సంగీత దర్శకత్వం వహిస్తున్నారు.

మరో వైపు ఓం సాయితేజ ఆర్ట్స్ బేనరుపై శాస్త్రం శాస్త్రం, నా కిష్టం ఎందుకంటే..? అన్న సీరియల్స్ కూడా రామానాయుడు స్టూడియోలో ప్రారంభమైయ్యాయి.. ఎస్ లక్ష్మీ రత్నం నిర్మాతగా వ్యవహరిస్తున్న శాస్త్రం శాస్త్రం సీరియల్ రాజా చంద్ర వర్మ దర్శకత్వంలో రూపొందుతోంది.

అలాగే నా కిష్టం ఎందుకంటే అన్న సీరీయల్‌ను ప్రతిష్టాత్మక దేవాలయాలు, పుణ్యక్షేత్రాలకు వెళ్లి అక్కడి యువతీ యువకుల అభప్రాయాలను సేకరించి అక్కడి స్థల మహత్యాలు వివరించే కార్యక్రమంగా తెరకెక్కిస్తున్నారు.. దీనికి సంగీతం నాగరాజ్ అందిస్తుండగా... దర్శకత్వం అనిల్ చేస్తున్నారు...

చివరగా ఈ సీరియల్స్‌లో వేదవ్యాస విరచిత అష్టాదశ పురాణాలు సమస్త వేదసారం ఉంటాయని దర్శక, నిర్మాతలు చెబుతున్నారు.. అలాగే ఆధ్యాత్మికతకు, భక్తరసానికి మూలాలు.. త్రిమూర్తులైన బ్రహ్మా, విష్టు, మహేశ్వరులు, దేవీ, నారదాది పురాణాలు సమస్త వేదసారం తదితర అంశాలు ఈ సీరియల్‌లో చూడవచ్చని తెలిపారు.
మరిన్ని
ఆర్య సమాజ్‌లో 'బుల్లి' తార ప్రేమ పెళ్లి
మరో సారి ప్రసారం కానున్న మాయల మరాఠీ
మోనార్క్ గ్రూప్ "వర్చువల్ ఆన్ ఎయిర్" విడుదల
సోమవారంనాటి టీవీ టైమ్
మా టీవీలో 'మీ తీర్పు'
విదేశాలకు వెళ్లేందుకు శిల్పకు సుప్రీం ఓకే