ప్రధాన పేజి > వినోదం > టీవీ టైమ్ > వార్తలు > నైటీల్లో తెలుగు యాంకర్ల యాంకరింగ్
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
నైటీల్లో తెలుగు యాంకర్ల యాంకరింగ్
FILE
తెలుగు టెలివిజన్ ఛానళ్ల మధ్య పోటీ తీవ్రమవుతోంది. రేటింగ్‌కోసం ఆయా టీవీ ఛానళ్లు ఇటీవల అనేకమైన గేమ్ షోలను నిర్వహిస్తూ హోరెత్తుస్తున్నాయి. అయితే మధ్యమధ్యలో సరిగమలు ఒలికించే సరాగాలు, శృంగార గీతికలు వస్తుంటాయి కదా.

ఈ షోలన్నిటినీ బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం చేస్తుంటారు బుల్లితెతెలుగు యాంకర్లు. అయితే వీరిలో కొంతమంది యాంకరింగ్ "యాక్" అనేటట్లు ఉంటోందని బుల్లితెర అభిమానులు ఇటీవల బహిరంగంగానే చర్చించుకుంటున్నారు.

ఉదయాన్నే చిన్నపిల్లలు స్కూలుకెళ్లే సమయంలో వారికి బ్రేక్‌ఫాస్ట్ పెడుతూ పొరపాటున టీవీ స్విచాన్ చేస్తే చాలు... కొంతమంది యాంకర్లు ఏకంగా నైటీలను వేసుకొని యాంకరింగ్ చేస్తూ దర్శనమిస్తున్నారని పెద్దలు అంటున్నారు. తొలుత సంప్రదాయబద్ధమైన దుస్తులు వేసుకుని మొదలుపెట్టన మన తెలుగు యాంకరింగ్ ఇప్పుడు నైటీలు, పొట్టి దుస్తుల దశకు చేరిందని వారు వాపోతున్నారు. కుటుంబ సభ్యులతో కూచుని టీవీ చూడాలంటే ఇబ్బందికరంగా మారుతోందంటున్నారు.

అన్నట్లు బాలీవుడ్ బుల్లితెర యాంకర్లు బికినీలు వేసుకుని యాంకరింగ్‌ చేయడానికి రెడీ అంటున్నారట. మరి సదరు టెలివిజన్ ఛానళ్లు గనుక "ఊ" అంటే బికినీ యాంకరింగ్ బాలీవుడ్ బుల్లితెరపై ప్రత్యక్షమవుతుంది. ఏం చేద్దాం అంతా కాలమహిమ. "ఇష్టం లేకున్నా.. ఆ దుస్తులు వేసుకుంటున్నా" అని తెలుగు వెండితెర నటీమణులు చెప్పినట్లు బుల్లితెర యాంకర్లు కూడా ఇదేమాటను చెపుతారేమో...?
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
టీవీరంగంలోకి మోహన్‌బాబు!
కాన్సెప్ట్ రియాల్టీ షోనే.. లక్ష్మీ టాక్ షో
ఎంత ఆస్థి ఉన్నా.. ఒదిగే వ్యక్తి సుమన్: ప్రభాకర్
ఎంటీవీ 'రోడీస్' షోను ప్రారంభించిన అక్షయ్
పెళ్లయిందిగా... ఇక బుల్లితెరకు వెళ్లండి
సక్సెస్‌ఫుల్ డ్యాన్స్ కార్యక్రమం 'ఆట'