కావలసినపదార్థాలు: ఆపిల్: నాలుగు కోడిగ్రుడ్డు: ఒకటి మైదా: 3 టేబుల్ స్పూన్లు నీరు: 1/4 లీటర్ పంచదార: ఆరు టేబుల్ స్పూన్లు నువ్వులు: ఒక టేబుల్ స్పూన్ నూనె: తగినంత
తయారీ విధానం: ఆపిల్ పండ్ల పై తోలును తీసి పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఒక పాన్‌లో గ్రుడ్డు, మైదా పిండిని కలిపి పెట్టుకోండి. ఈ పిండిలో కట్ చేసిన ఆపిల్ ముక్కల్ని కలుపుకోండి. ఆపిల్‌ముక్కలకు మైదాపిండి పట్టించి వేడయిన నూనెలో బ్రౌన్‌కలర్ వచ్చేంతవరకు వేయించండి. మరో బాణలిలో ఒక టేబుల్ స్పూన్ నూనెను పోసి అందులో పంచదార చేర్చండి. ఐదునిమిషాల వేడి చేయండి. ఇందులో వేయించిన ఆపిల్ ముక్కల్ని కలుపుకోండి. తర్వాత నీటిలో ఆ ముక్కల్ని ఆరనించి, ఆ నీటి నుంచి ఆపిల్ ముక్కల్ని తీసి సర్వ్ చేయండి. ఈ షాంగాయ్ ఆపిల్‌కు టమోటా సాస్‌ను సైడిష్‌గా వాడుకుంటే రుచికరంగా ఉంటుంది.
|