కావలసిన పదార్థాలు :ఎగ్ నూడిల్స్... పావుకేజీపాక్ చోయ్ ఆకులు (పాలకూరలాగా ఉండే చైనీస్ ఆకు).. కొద్దిగాబ్రౌన్ షుగర్... ఒకటిన్నర టీస్పూన్సోయాసాస్... ఒకటిన్నర టీస్పూన్బేసిక్ స్టాక్ రెండు టీస్పూన్లునువ్వుల నూనె... కొద్దిగాఉప్పు... సరిపడావెల్లుల్లి రేకలు... నాలుగువెనిగర్... ఒక టీస్పూన్బోన్లెస్ చికెన్... 100 గ్రాములుతెల్ల బఠాణీ... అరకేజీమొక్కజొన్న పిండి... ఒక టీస్పూన్నూనె... రెండు టీస్పూన్లుక్యాప్సికమ్... ఒకటితయారీ విధానం :సగం నూడిల్స్ ఉడికించి, నీటిని ఒంపేయాలి. ఒక స్పూన్ నూనెను వీటికి కలపాలి. పాత్రలో కొద్దిగా నూనె వేసి మిగతా పావు వంతు నూడిల్స్‌ను లేత గోధుమరంగు వచ్చేదాకా వేయించి పక్కన పెట్టుకోవాలి.మరో పాత్రలో ఒక టీస్పూన్ ఆయిల్ వేసి వెల్లుల్లి, చికెన్ ముక్కలు వేసి నాలుగు నిమిషాలపాటు ఉడికించాలి. స్టాక్, కార్న్‌ఫ్లోర్ కలిపి, సోయాసాస్‌తో పాటుగా పాన్‌లో వేసి కలియబెట్టాలి.ఇంకో పాత్రలో క్యాప్సికం, బఠాణీలు, బ్రౌన్ షుగర్, వెనిగర్, ఉప్పు, పాక్‌చోయ్ ఆకులు వేసి రెండు నిమిషాలు ఉడికించి తీసి, పక్కన పెట్టుకోవాలి. అదే పాత్రలో రెండు టీస్పూన్ల నూనె వేసి అందులో నూడిల్స్ కలపాలి. మిగతా సోయాసాస్ కలిపి రెండు మూడు నిమిషాలపాటు వేయించాలి. చివరగా... ఒక పెద్ద పాత్రను తీసుకుని అంచెలంచెలుగా వేయించుకున్న పదార్థాలన్నింటినీ కలియబెట్టి వేడి వేడిగా వడ్డించాలి. |