మాంసాహారం | భారతీయ | స్వీట్లు | చైనీస్ | శాకాహారం | చిట్కాలు | కాంటినెంటల్ | ఫాస్ట్ ఫుడ్
ప్రధాన పేజి » ఇతరాలు » వంటకాలు » చైనీస్ » "చిల్లీ బటర్ ఫ్రైడ్ రైస్" విత్ కాజూ, సాస్..! (Cookery | Pulav Rice | Onion | Elachi | Butter | Salt | Chili)
Feedback Print Bookmark and Share
 
Fried Rice
FILE
కావలసిన పదార్థాలు :
పులావ్ రైస్.. 500 గ్రా.
ఉల్లిపాయలు.. వంద గ్రా.
యాలకులు.. నాలుగు
బటర్.. 200 గ్రా.
ఉప్పు.. తగినంత
చిల్లీ తరుగు.. అరకప్పు

తయారీ విధానం :
ముందుగా ఉల్లిపాయల్ని తరిగి పక్కన పెట్టుకోవాలి. బియ్యాన్ని శుభ్రం చేసుకుని 5 నిమిషాల పాటు ఊరబెట్టాలి. ఓ బాణలిలో బటర్‌ను మరిగించి ఉల్లిపాయ, చిల్లీ ముక్కల్ని అందులో వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత యాలకులు, లవంగాల పొడిని వేసి వేయించాలి.

ఇందులో పులావ్ బియ్యాన్ని వేసి కాసేపు వేయించి... వాటికి సమపాళ్ళలో వేడినీటిని పోసి, తగినంత ఉప్పును చేర్చుకోవాలి. బియ్యం ఉడికాక.. పొడిపొడిగా అయిన వెంటనే స్టౌ మీద నుంచి దించేయాలి. ఈ రైస్ మీద వేయించిన జీడిపప్పు, సాస్‌లతో అలంకరించుకుని సర్వ్ చేస్తే సరి..!
సంబంధిత సమాచారం కోసం శోధించండి.