మాంసాహారం | భారతీయ | స్వీట్లు | చైనీస్ | శాకాహారం | చిట్కాలు | కాంటినెంటల్ | ఫాస్ట్ ఫుడ్
ప్రధాన పేజి » ఇతరాలు » వంటకాలు » చైనీస్ » ఐసింగ్ షుగర్, కోకో ఘుమఘుమలతో "స్వస్‌రోల్ కేక్" (Chinese | Maida Flour | Baking Powder | Hot Water | Eggs | Vanilla Essence)
Feedback Print Bookmark and Share
 
Cake
FILE
కావలసిన పదార్ధాలు :
మైదాపిండి... 80 గ్రా.
కోడిగుడ్లు... మూడు
బేకింగ్ పౌడర్... పావు చెంచా
వేడినీరు... ఒక
వెనిల్లా ఎసెన్స్... కాసిన్ని చుక్కలు
చక్కెర... 85 గ్రా.
జామ్... 55 గ్రా.

తయారీ విధానం :
మైదాపిండిని, బేకింగ్ పౌడర్‌ను జల్లెడలో జల్లించుకుని, రెండింటిని కలిపి వేడినీరు పోసి ముద్దలా చేసుకోవాలి. కోడిగుడ్డు సొనను తీసుకుని బాగా కలియబెట్టాలి. ఇందులో పంచదార వేసి బాగా కరిగేలా కలపాలి. ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలో పోసి నీరు మరుగుతున్న పాత్రలో ఉంచాలి, ఆవిరి వల్ల కోడిగుడ్డు సొన వేడెక్కి, సొనంతా చిక్కగా అయి గట్టిపడినట్లవుతుంది. దీనిని చెంచాతో కలిపి క్రీమ్‌లా చేయాలి.

ఈ క్రీమ్‌కు మైదా, బేకింగ్ పౌడర్ మిశ్రమాన్ని కూడా జత చేసి, కాస్త ఎసెన్స్ కలపాలి. స్వస్‌రోల్ డబ్బా తీసుకుని దాని లోపలి గోడలకు నెయ్యిగానీ, నూనెగానీ రాయాలి. దాంట్లో పైన కలిపి ఉంచుకున్న పదార్ధం అంతటిని పోయాలి. ఈ డబ్బాను ఓవెన్‌లో ఉంచి 200 సెంటీగ్రేడ్ వద్ద 15 నిమిషాలు ఉంచాలి

ఒక పేపర్ తీసుకుని పంచదార పోసి, దానిపైన ఓవెన్‌లో ఉడికించిన పదార్థాన్ని వేడి చల్లారకుండా వేయాలి. పదార్ధం వేడిగా ఉన్నప్పుడే స్పూన్ సాయంతో కేక్ మీద జామ్ రాయాలి. ఈ కేక్‌పై ఐసింగ్ షుగర్, కోకో మొదలైన వాటితో అలంకరించి సర్వ్ చేస్తే సరి..!
సంబంధిత సమాచారం కోసం శోధించండి.