కావలసిన పదార్థాలు :మైదాపిండి... ఒక కప్పుచక్కెరపొడి... ఒక కప్పునెయ్యి... అర కప్పు బేకింగ్ పౌడర్... తగినంతతయారీ విధానం :మైదాపిండి, చక్కెర, నెయ్యి, బేకింగ్ పౌడర్ వేసి కలిపి బిస్కెట్లలా ఒత్తుకొని మైక్రోవేవ్ ఓవెన్‌లో బేక్ చేయాలి. ఓవెన్ లేకపోతే ప్రెషర్ పాన్‌కు కాస్త నెయ్యి రాసి బేక్ చేయవచ్చు. బేక్ చేసేటపుడు, నీళ్ళు అవసరంలేదు. అలాగే గ్యాస్కెట్ పెట్టకుండా మూత పెట్టాలి. 10-15 నిముషాల బేక్ చేస్తే సరిపోతుంది.ఈ బిస్కెట్లు మరీ ఎర్రగా కాక అడుగు కాస్త ఎర్రగా ఉంటే చాలు మృదువుగా ఉంటాయి. ఇలాగే రాగి పిండి, గోధుమపిండితో కూడా బిస్కెట్లను తయారు చేయవచ్చు. చక్కెర బదులు ఉప్పు చేరిస్తే ఉప్పు బిస్కట్లు కూడా సిద్ధమైనట్లే..! |