కావలసిన పదార్థాలు :కొబ్బరినీళ్ళు... అర కప్పుపేషన్ ఫ్రూట్ రసం... అర కప్పుపాలు... ఒక కప్పువెనీలా ఐస్‌క్రీమ్... ఒక కప్పుఫైనాఫిల్ జ్యూస్... ఒక కప్పుతయారీ విధానం :కొబ్బరినీళ్లు, పండ్లరసం (పేషన్ ఫ్రూట్ లేని పక్షంలో కమలారసం కలుపుకోవచ్చు), పాలు, ఐస్‌క్రీమ్ అన్నింటినీ బ్లెండర్‌లో వేసి బాగా కలిపి ఫ్రిజ్‌లో పెట్టండి. తరువాత గాజు గ్లాసుల్లోకి ఈ మిశ్రమం వంపి పైన ఐస్‌క్యూబ్స్ వేసి చల్లచల్లగా అతిథులకు అందించాలి. గ్లాసు అంచులకు ఓ చిన్న అరటిపండు ముక్కను అలంకరించి ఇస్తే చూసేందుకు కళ్లకు ఇంపుగా కూడా ఉంటుంది. |