మాంసాహారం | భారతీయ | స్వీట్లు | చైనీస్ | శాకాహారం | చిట్కాలు | కాంటినెంటల్ | ఫాస్ట్ ఫుడ్
ప్రధాన పేజి » ఇతరాలు » వంటకాలు » కాంటినెంటల్ » "కలర్‌ఫుల్ మ్యాంగో రైస్ సలాడ్" విత్ టొమోటో, క్యాప్సికమ్..! (Continental | Mango Rice Salad | Tomato | Capsicum | Onion Leaves | Rice | Mango | Fruit | Olive Oil)
Feedback Print Bookmark and Share
 
FILE
కావలసిన పదార్థాలు :
టమోటో... ఒకటి
క్యాప్సికం... ఒకటి
ఉల్లికాడ... ఒకటి
అన్నం... ఒక కప్పు
మామిడిపండు గుజ్జు... అర కప్పు
నిమ్మరసం... ఒక టీ.
ఆలివ్ నూనె... మూడు టీ.
ఉప్పు, మిరియాల పొడి... రుచికి సరిపడా
కొత్తిమీర... ఒక కట్ట

తయారీ విధానం :
ముందుగా టమోటో, క్యాప్సికమ్‌లను కోసి గింజలు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా తరిగి ఉంచుకోవాలి. ఉల్లికాడను సన్నటి చక్రాల్లాగా తరిగి అన్నంలో కలపాలి. మామిడి గుజ్జులో మిరియాలపొడి, ఉప్పు, నూనె, నిమ్మరసం వేసి చిక్కగా తయారు చేయాలి. దీనిని అన్నంలో వేసి బాగా కలిపి రిఫ్రిజిరేటర్‌లో అరగంటపాటు ఇంచాలి.

తినడానికి ముందు తీసి, దీనిని కొత్తిమీరతో అలంకరించుకోవాలి. కొద్దిగా తీపి, కొద్దిగా పులుపు, కొద్దిగా కారంగా తయారైన మ్యాంగో రైస్ సలాడ్ కొత్త రుచితో మిమ్మల్ని అలరిస్తుంది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.