కావలసిన పదార్థాలు : సన్నగా తరిగిన పాలకూర... రెండు కట్టలుశెనగపిండి... పావు కేజీబియ్యంపిండి... రెండు టీ.మంచినీరు... తగినన్నినూనె... సరిపడాకొత్తిమీర తురుము... రెండు టీ.పచ్చిమిర్చి... పదిఅల్లం... ఒక టీ.ఉప్పు... తగినంతజీలకర్ర పొడి... అర టీ.తయారీ విధానం :ఓ గిన్నెలో పాలకూర తురుము వేసి అందులో కొత్తిమీర తురుము, పచ్చిమిర్చి, కారం, అల్లం, జీలకర్ర పొడి, ఉప్పు వేసి చేత్తో కొద్దిగా నలపాలి. తరవాత అందులోనే బియ్యప్పిండి, సెనగపిండి వేసి కొద్దిగా నూనె వేడి చేసి పోసి తగినన్ని నీళ్లు పోసి పకోడీ పిండిలా కలపాలి. స్టవ్‌మీద బాణలి పెట్టి నూనె పోసి కాచి పిండిని చిన్న చిన్న ముద్దలుగా వేస్తూ దోరగా వేయించి తీసేయాలి. అంతే పాలక్ పకోడా రెడీ..! |