కావలసిన పదార్థాలు : శెనగపిండి... పావు కేజీబియ్యంపిండి... ముప్పావు కేజీఉల్లిపాయ తరుగు... ఒక కేజీనూనె... వేయించేందుకు సరిపడాపచ్చిమిర్చి తరుగు... అర కప్పుకరివేపాకు తరుగు... అర కప్పుకొత్తిమీర తరుగు... అర కప్పుఅల్లంవెల్లుల్లి పేస్ట్... పావు కప్పుకారం... రెండు టీ.గరంమసాలా... ఒక టీ.ఉప్పు... తగినంతబేకింగ్ పౌడర్... పావు టీ.తయారీ విధానం :ఉల్లిపాయల తరుగులో పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర తురుము, ఉప్పు, కారం, మసాలా పొడి, బేకింగ్ పౌడర్, అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపాలి. తరువాత కొద్దిగా నూనె వేడి చేసి అందులో పోయాలి. సెనగపిండి, బియ్యప్పిండిని కూడా వేసి తగినన్ని నీళ్లు పోసి గట్టిగా కలపాలి. బాణలిలో నూనె పోసి కాగాక... పిండిముద్దను చేతిలోకి తీసుకుని కొద్ది కొద్దిగా వేస్తూ... కరకరలాడేలా వేయించి తీయాలి. అంతే రుచికరమైన వేడి వేడి అల్లం వెల్లుల్లి మసాలా పకోడీ సిద్ధమైనట్లే..! |