కావలసిన పదార్థాలు : అరటిపండ్లు... రెండుమైదా... ఒకటిన్నర కప్పుపంచదార... ఐదు టీ.కొబ్బరి తురుము... మూడు టీ.నెయ్యి... రెండు టీ.నూనె... వేయించేందుకు సరిపడాయాలకుల పొడి... చిటికెడుఉప్పు... చిటికెడుతయారీ విధానం :స్టవ్‌మీద బాణలి పెట్టి నెయ్యి వేసి అందులో కొబ్బరి తురుము వేసి బంగారు వర్ణంలోకి వచ్చేవరకూ వేయించాలి. తరువాత అరటిపండ్ల తొక్క తీసి మెత్తగా చిదమాలి. అందులోనే మైదా, పంచదార, యాలకుల పొడి, వేయించిన కొబ్బరి ముక్కలు, ఉప్పు వేసి కలపాలి. అవసరమైతే కొద్దిగా నీళ్లు కలిపి గట్టి పిండిలా చేయాలి. బాణలిలో నూనె పోసి కాగాక... వీటిని చిన్నగా గుండ్రని వడల మాదిరిగా నూనెలో వేయించి తీసేయాలి. అంతే అరటిపండు పనియారమ్ సిద్ధమైనట్లే..! |