కావలసిన పదార్థాలు :కాలీఫ్లవర్ ముక్కలు... రెండు కప్పులుశెనగపిండి... ఒకటిన్నర కప్పువరిపిండి... రెండు టీ.కారం... అర టీ.ఉప్పు... తగినంతగరంమసాలా... అర టీ.నూనె... వేయించేందుకు సరిపడామంచినీళ్లు... తగినన్నితయారీ విధానం :ముందుగా సెనగపిండి, వరిపిండి, ఉప్పు, గరం మసాలా, కారం అన్నీ కలిపి తగినన్ని నీళ్లతో పకోడీల పిండిలా జారుగా కలుపుకోవాలి. ముక్కలుగా చేసిన కాలీఫ్లవర్ ముక్కలను గోరువెచ్చని నీటిలో కాసేపు ఉంచి ఆ తరువాత తీసి పేపర్‌పైన ఆరబెట్టాలి.ఆపై పకోడీల పిండిలో కాలీఫ్లవర్ ముక్కలను ముంచి, బాగా కాగుతున్న నూనెలో వేసి ఎర్రగా వేయించి తీసేయాలి. అంతే కరకరలాడే కాలీఫ్లవర్ పకోడీలు తయారైనట్లే...! కరకరలాడుతూ, మాంచి టేస్టీగా ఉండే ఈ పకోడీలను తినకుండా ఎలా ఉండగలం చెప్పండి... అందుకనే హాంఫట్ చేసేద్దామా...?! |