కావలసిన పదార్థాలు :బియ్యంపిండి... అర కేజీమినప్పప్పు... రెండు కేజీలుకొబ్బరి కోరు... ఒక చిప్పదిఉప్పు... తగినంతనూనె... వేయించేందుకు సరిపడామిరియాలు... రెండు టీ.కారం... ఒక టీ.టొమోటో ముక్కలు అర కప్పుఉల్లిపాయ తరుగు.. పావు కప్పుబఠానీలు... అర కప్పుతయారీ విధానం :మినప్పప్పు నీళ్లలో నానబెట్టి బాగా నానిన తర్వాత రుబ్బాలి. ఈ పిండికి బియ్యంపిండిని కూడా కలిపి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు కొబ్బరి కోరులో, మిరియాలు, కొద్దిగా కారం, ఉప్పు కలిపి నూనెలో దోరగా వేయించాలి. దీనికి బంగాళాదుంపలు, టోమాటో, ఉల్లిపాయలు, బఠానీలను కూడా కలిపి బాగా వేయించాలి. ఈ మిశ్రమాన్ని ఉండలుగా చేసుకుని రుబ్బుకున్న పిండిలో ముంచి బాగా కాగుతున్న నూనెలో వేసి, ఎర్రగా వేయించి తీసేయాలి. అంతే వేడి వేడి మైసూర్ బోండాలు సిద్ధమయినట్లే..! |