ఇది తినను, అది వద్దు, అబ్బే అదేం బాగాలేదు..... అంటూ వంకలు పెట్టి, లంచ్ తినకుండా తప్పించుకునే పిల్లల్ని చాలామందినే చూస్తుంటాం. ఇలాంటి పిల్లలకు స్కూళ్లకు లంచ్ బాక్స్ మోసుకెళ్లటం అంటేనే పరమ చిరాకు. అలాంటప్పుడు వారు ఇష్టపడేలాగా కలర్‌ఫుల్‌గా ఉండేలా తయారయ్యే వెరైటీలను గనుక చేసి ఇచ్చినట్లయితే, ఎలాంటి పేచీలు పెట్టకుండా చక్కగా లంచ్‌ని తీసుకెళ్తారు. అలాంటి వాటిలో ఒకటైన వెజిటబుల్ రైస్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.కావలసిన పదార్థాలు :బియ్యం... ఒక కప్పుఉల్లిపాయ ముక్కలు, పచ్చిబఠానీలు, బీన్స్, క్యారెట్ ముక్కలు... తలా అర కప్పుఅల్లం, వెల్లుల్లి పేస్ట్... ఒక టీ.నూనె... కొద్దిగాతయారీ విధానం :పాత్రలో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక ఉల్లిపాయలను వేయించాలి. అల్లం వెలుల్లి పేస్ట్ కూడా అందులో వేసి వేయించి, తరువాత కూరగాయ ముక్కలు వేసి వేయించాలి. అందులో బియ్యానికి రెండొంతుల చొప్పున నీటిని పోసి ఉడికించాలి. (కావాలనుకుంటే ఇందులో స్ప్రౌట్స్, తురిమిన పనీర్, వేరుశెనగ గింజలు, దాల్చిన చెక్క వేసుకోవచ్చు) ఎసరు మసలుతుండగా కడిగి ఉంచుకున్న బియ్యాన్ని అందులో వేసి, అన్నం బాగా ఉడికి పొడి పొడిగా అయ్యేలాగా చేసి దించేయాలి. అంతే కలర్‌ఫుల్‌గా ఉండే వెజిటబుల్ రైస్ తయారైనట్లే...!స్పూన్‌కి అంటుకోకుండా, జిగురుగా లేకుండా తక్కువ నీళ్లు పోసి ఈ రైస్‌ని వండితే మంచిది. ఎందుకంటే, ముద్దగా ఉండే అన్నాన్ని చిన్నపిల్లలు ఇష్టపడరు. లంచ్ టైంలో ఈ వెజిటబుల్ రైస్‌ని ఆరగించే చిన్నారులకు 170 క్యాలరీల శక్తి, 29 గ్రాముల పిండి పదార్థాలు, 6 గ్రాముల ప్రోటీన్లు అందుతాయి. కాబట్టి మీరు కూడా ట్రై చేయండి...! |