కావలసిన పదార్థాలు :కాలీఫ్లవర్... ఒకటిఅల్లం... చిన్న ముక్కకొత్తిమీర తురుము.. ఒక టీ.ఉప్పు... తగినంతఉల్లిపాయ... ఒకటిపచ్చిమిర్చి... ఆరుగరంమసాలా... అర టీ.నూనె... వేయించేందుకు సరిపడాశెనగపిండి... పావు కేజీతయారీ విధానం :శెనగపిండిలో కొత్తిమీర తురుము, ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు, గరంమసాలా, అల్లం తరుగు, పచ్చిమిర్చి తరుగు... అన్నీ వేసి తగినన్ని నీళ్లు పోసి జారుగా కాకుండా గట్టిగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కాలీఫ్లవర్ ముక్కలకు పట్టించి ఓ అరగంటసేపు నాననివ్వాలి. స్టవ్‌మీద బాణలి పెట్టి నూనె కాగాక తక్కువ మంటమీద కొద్దికొద్దిగా కాలీఫ్లవర్ ముక్కల్ని వేసి వేయించి తీయాలి. అంతే కాలీఫ్లవర్ జింజర్ పకోడీలు సిద్ధమైనట్లే... వీటిని వేడివేడిగా కెచప్‌తో తింటే రుచిగా ఉంటాయి. |