కావలసిన పదార్థాలు :మైదాపిండి... అరకేజీపాలు... పావు లీ.ఉప్పు... తగినంతనూనె లేదా నెయ్యి... వంద గ్రా.తయారీ విధానం :జల్లించిన మైదాపిండిలో పాలు, ఉప్పు వేసి మెత్తని ముద్దలా కలిపి 15 నిమిషాలు నానబెట్టాలి. పిండిని బాగా మెత్తగా మర్దించి 10 ముద్దలుగా విడదీసి గుండ్రంగా చేసి ప్లేటులో ఉంచాలి. తరువాత వేడి చేసిన 2 టేబుల్ స్పూన్ల నూనె ముద్దలమీద పోసి 15 నిమిషాలు నాననివ్వాలి. ఒక్కో పిండి ముద్దనూ తీసుకొని అప్పడాలకర్రతో పలుచగా పెద్దగా సన్నని పొరలా ఒత్తాలి.ఇలా ఒత్తిన రొట్టెను ఒకవైపు నుంచి గరాటా మాదిరిగా చుట్టుకురావాలి. తరువాత దీన్ని రెండువైపులనుంచి దగ్గరగా ఒత్తి, గుండ్రంగా చుట్టి చేతివేళ్లతో కాస్త వెడల్పుగా తట్టాలి. దీన్ని పెనంమీద వేసి... కాస్త కాలిన తరువాత కొద్దిగా నూనె లేదా నెయ్యి వేసి ఎర్రగా కాల్చి తీస్తే పొరలుపొరలుగా ఉండే నోరూరించే "జిలేబీ పరాటా" రెడీ అయినట్లే...!! |