కావలసిన పదార్థాలు :పచ్చిబఠాణీలు, పెసలు, అలసందలు, శెనగలు... తలా ఒక్కో కప్పునూనె... ఐదు టీ.జీలకర్ర... ఒక టీ.ఉల్లిపాయలు.... నాలుగుటొమోటోలు... ఆరుక్యాప్సికమ్... రెండుటొమోటో సాస్.. నాలుగు టీ.అల్లం ముద్ద... రెండు టీ.కరివేపాకు... రెండు రెమ్మలుఉప్పు... సరిపడానిమ్మకాయలు... రెండుఛీజ్... 4 టీ.కొత్తిమీర... ఒక కట్టతయారీ విధానం :గింజలన్నీ మొలకలు వచ్చేలా చేసుకోవాలి. ఉల్లిపాయలు, టొమాటో, క్యాప్సికమ్, కొత్తిమీరలను సన్నగా తరగాలి. మందపాటి బాణలిలో నూనె వేసి వేడిచేయాలి. జీలకర్ర వేసి చిటపటమన్నాక ఉల్లిపాయ ముక్కలు వేయాలి. అవి వేగాక అన్ని రకాల మొలకలు, క్యాప్సికమ్, టొమాటో ముక్కలు వేసి మొలకలు కాస్త మెత్తబడేవరకూ వేయించాలి. అవసరమైతే కొద్దిగా నీళ్లు చిలకరించాలి.స్టవ్‌మీద నుంచి దించి కరివేపాకు సన్నగా తరిగి అందులో కలపాలి. తరువాత ఉప్పు, నిమ్మరసం పిండి బాగా కలపాలి. చివరగా ఛీజ్, కొత్తిమీర తురుములను వేసి కలపాలి. విస్తరాకులతో చేసిన చిన్న చిన్న బౌల్స్‌లో ఈ మొలకల భేల్ సర్ది టొమాటో సాస్‌తో తింటే మంచి రుచితో పాటు, ఆరోగ్యవంతం కూడా...!! |