కావలసిన పదార్థాలు :అన్నం... ఐదు కప్పులునూనె లేదా నెయ్యి... మూడు టీ.ఆవాలు... ఒక టీ.కరివేపాకు... మూడు రెమ్మలుక్యాప్సికం... నాలుగుఉప్పు... సరిపడాపచ్చికొబ్బరి తురుము... రెండు టీ.వేరుశెనగపప్పు... రెండు టీ.పొడి కోసం...ఎండుమిర్చి... ఐదుధనియాలు... రెండు టీ.జీలకర్ర... ఒక టీ.మినప్పప్పు... రెండు టీ.దాల్చిన చెక్క... చిన్న ముక్కవేరుశెనగపప్పు... నాలుగు టీ.నెయ్యి... రెండు టీ.తయారీ విధానం :పాన్‌లో నెయ్యి వేసి వేడయ్యాక జీలకర్ర, మినప్పప్పు వేసి వేయించాలి. అందులోనే ధనియాలు, దాల్చిన చెక్క, కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేసి వేయించి.. చివర్లో వేరుశెనగపప్పు కూడా వేసి వేయించి తీసి చల్లార్చి పొడి చేసుకోవాలి. పొడిపొడిగా ఉండే వేడి వేడి అన్నంలో ఈ పొడిని కలుపుకోవాలి.అదే పాన్‌లో నూనె లేదా నెయ్యి వేసి వేడయ్యాక ఆవాలు చిటపటమనిపించి, కరివేపాకు వేసి వేయించాలి. దాంట్లోనే క్యాప్సికం ముక్కలను వేసి ఐదు నిమిషాలపాటు వేయించాలి. తగినంత ఉప్పు, కొబ్బరి తురుము, వేయించిన పల్లీలు, మసాలా పొడి వేసి వేయించాలి. దీన్ని పై అన్నంలో వేసి కలపాలి. అంతే క్యాప్సికం మసాలా రైస్ రెడీ అయినట్లే...! దీన్ని ఏదేనీ గ్రేవీ కర్రీ లేదా ఊరగాయ, పెరుగు కాంబినేషన్‌తో తింటే అదిరిపోతుంది. |