కావలసిన పదార్థాలు :అరటికాయలు... రెండుకారం... ఒక టీ.జీలకర్రపొడి... ఒక టీ.ఉప్పు... సరిపడానూనె... వేయించేందుకు సరిపడాతయారీ విధానం :అరటికాయల చెక్కుతీసి చిప్స్‌లా సన్నగా కోయాలి. బాణలిలో నూనె పోసి కాచాలి. కాగిన నూనెలో ఈ ముక్కలు కొద్దికొద్దిగా వేసి వేయించి చిల్లుల గరిటెతో తీయాలి. వేయించడం పూర్తయ్యాక అన్నీ కలిపి మళ్లీ ఓసారి వేయించి తీయాలి. తీసిన వెంటనే వీటిని వెడల్పాటి బేసిన్‌లో వేసి ఉప్పు, కారం, జీలకర్రపొడి చల్లి బాగా షేక్ చేసినట్లుగా కలిపితే చిప్స్ కరకరలాడే కేరళ అరటికాయ చిప్స్ రెడీ అయినట్లే...! |