కావలసిన పదార్థాలు :బంగాళాదుంప తురుము... అర కప్పుబియ్యంపిండి... పావు కేజీనెయ్యి... రెండు టీ.పసుపు... పావు టీ.కారం... ఒక టీ.జీరాపొడి... ఒక టీ.వాము... ఒక టీ.ఉప్పు... తగినంతనూనె... వేయించేందుకు సరిపడాతయారీ విధానం :ముందుగా బియ్యంపిండిలో వాము, కారం, ఉప్పు, జీరాపొడి, పసుపు, బంగాళాదుంప తురుము వేసి నీరు కలుపుతూ ముద్దలా చేసుకోవాలి. దీన్ని కనీసం 20 నిమిషాలపాటు అలాగే నానబెట్టాలి. తరువాత జంతికలు చేసే చట్రంలో పిండిని కొద్ది కొద్దిగా నింపుతూ.. బాగా కాగుతున్న నూనెలో జంతికల్లాగా పిండుకోవాలి. జంతికలు బాగా ఎర్రగా కాలిన తరువాత తీసేయాలి. అంతే ఆలూ జంతికలు సిద్ధమైనట్లే...! ఇందులో బంగాళాదుంపను కలపడంవల్ల జంతికలు వెరైటీ రుచితో కమ్మగా అలరిస్తాయి. |