కావలసిన పదార్థాలు : చపాతీలు.. మూడు నూనె.. తగినంత మీఠా చట్నీ.. అర కప్పు పెరుగు.. పెద్ద కప్పు కారం.. అర టీ. జీలకర్ర పొడి.. ఒక టీ. ఉప్పు.. తగినంత నల్ల ఉప్పు.. కొద్దిగా కొత్తిమీర తరుగు.. చిన్న కప్పు
మీఠా చట్నీ తయారీ... కొద్దిగా చింతపండును ఉడికించి చిక్కటి గుజ్జు తీయాలి. దీనికి తగినంత బెల్లంపొడి, జీలకర్ర పొడి, ఉప్పు , కారం చేర్చాలి. దీన్ని కాసేపు ఉడికించి దించేస్తే.. మీఠా చట్నీ తయార్..!
తయారీ విధానం : చపాతీలను నాలుగు ముక్కలుగా చేసి నూనెలో దోరగా వేయించాలి. వీటిని మళ్ళీ చిన్నచిన్న ముక్కలుగా చేసి ఓ ప్లేటులో సర్ది, పైన పెరుగు పోయాలి. ఇప్పుడు వాటిపై తగినంత మీఠాచట్నీ వేయాలి. ఈ మిశ్రమంపై ఉప్పు, జీలకర్ర పొడి, నల్ల ఉప్పు, కారం చల్లాలి. కొత్తీమీర తరుగుతో అలంకరిస్తే చపాతీ ఛాట్ సిద్దమైనట్లే. ఇష్టమున్నవారు సన్నని కారప్పూస కూడా వేసుకోవచ్చు, చేసిన వెంటనే తింటే... చపాతీ ముక్కలు కరకరలాడుతూ భలే రుచిగా ఉంటాయి.