కావలసిన పదార్థాలు : గోబీ పువ్వు.. చిన్నసైజుది ఒకటి బంగాళాదుంపలు.. రెండు లావు అటుకులు.. పావు కేజీ పచ్చిమిర్చి తరుగు.. ఆరు కాయలది కరివేపాకు.. రెండు రెమ్మలు కొత్తిమీర.. 2 రెమ్మలు ఆవాలు.. ఒక టీ. జీలకర్ర.. ఒక టీ. ఎండుమిర్చి.. మూడు పసుపు.. అర టీ. ఉప్పు, నూనె.. తగినంత పచ్చి కొబ్బరి తురుము.. కాస్తంత
తయారీ విధానం : బాణలిలో నూనె వేడి చేసి పప్పు దినుసులు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పసుపు, ఉప్పు వరుసగా వేసి కాసేపు వేయించాక.. గోబీ, ఆలూ ముక్కల్ని వేసి కలిపి సన్నని సెగపై ఉడికించాలి. తరువాత అటుకులను వేసి 5 నిమిషాలపాటు సన్నని సెగపై ఉడికించాలి. దింపేముందు తరిగిన కొత్తిమీర, కొబ్బరి తురుము చల్లి వేడివేడిగా వున్నప్పుడే స్నాక్స్‌లాగా సర్వ్ చేయాలి. అంతే రుచికరమైన అటుకుల పోణీ తయార్..!