మాంసాహారం | భారతీయ | స్వీట్లు | చైనీస్ | శాకాహారం | చిట్కాలు | కాంటినెంటల్ | ఫాస్ట్ ఫుడ్
ప్రధాన పేజి » ఇతరాలు » వంటకాలు » ఫాస్ట్ ఫుడ్ » రొటిన్‌కు కాస్త భిన్నంగా "ఛట్‌పట్ దోశెలు" (Fast food | Dosa Mix | Green Peas | Paneer | Beans | Carrot | Capsicum | Cashew Nuts Paste)
Feedback Print Bookmark and Share
 
Chatpat Dosa
FILE
కావలసిన పదార్థాలు :
దోసెపిండి.. 3 కప్పులు
పచ్చి బఠాణీ.. 50 గ్రా.
పన్నీరు.. 50 గ్రా.
బీన్స్.. నాలుగు
క్యారెట్.. ఒకటి
క్యాప్సికం.. రెండు
తాలింపు దినుసులు.. కొద్దిగా
ఖాజూ పేస్ట్.. 2 టీ.
మిర్చి పొడి.. 2 టీ.
ఉప్పు.. సరిపడా
ఉల్లిపాయ ముక్కలు.. 2 టీ.
రిఫైండ్ ఆయిల్.. 3 టీ.
కొత్తిమీర తురుము.. రెండు కట్టలు
చీజ్ తురుము.. కొద్దిగా

తయారీ విధానం :
పచ్చి బఠాణీ, బీన్స్, క్యారెట్ ముక్కలను వేడినీళ్ళలో కొద్దిసేపు ఉడికించాలి. కడాయిలో ఆయిల్ వేడి చేసి ఉల్లిపాయల్ని దోరగా వేయించి జీరా, వెజిటబుల్స్ ముక్కలు వేసి సన్నని సెగపై ఉడికించాలి. పన్నీర్, పచ్చిబఠాణీ వేసి మరి కొద్దిసేపు ఉడికించాక, ఖాజూ పేస్ట్ వేసి మరో 5 నిముషాలు ఉడికించి, తురిమిన కొత్తిమీర చల్లి పక్కన పెట్టుకోవాలి.

పెనంపై దోశెవేసి దోరగా వేయించి పైన ఛీజ్ తురుము చల్లి.. దానిపై ముందుగా తయారు చేసుకున్న వెజ్‌కర్రీతో కోటింగ్ వేసి దోశను దోరగా కాల్చి చుట్టి తీసేయాలి. అంతే ఛట్‌పట్ దోశె తయార్..! ఎప్పుడూ ఒకేలా కాకుండా.. అప్పుడప్పుడూ ఇలా వెరైటీగా దోశెలను చేసి ఇస్తే పిల్లలు, పెద్దలు ఇష్టంగా తింటారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.