కావలసిన పదార్థాలు : గోధుమ పిండి... రెండు కప్పులు మంచినీళ్లు... తగినన్ని ఉప్పు... సరిపడా నూనె... సరిపడా కాలీఫ్లవర్ తురుము... రెండు కప్పులు పచ్చిమిర్చి... రెండు సన్నగా తురిమినవి కొత్తిమీర... ఒక టీ. కారం... అర టీ. ఉప్పు... సరిపడా
తయారీ విధానం : గోధుమపిండి జల్లించి ఉప్పు, నీళ్లు వేసి చపాతీ పిండిలా కలపాలి. కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉప్పు, తురిమిన కాలిఫ్లవర్ అన్నీ బాగా కలిపి నీళ్లు పిండేయాలి. ఇందులో కారం వేసి బాగా కలపాలి. కలిపి ఉంచుకున్న పిండిని చిన్న చిన్న ముద్దలుగ చేసుకోవాలి. ఒక్కో ముద్దనీ పూరీలా వత్తాలి.
దాని మధ్యలో కాలిఫ్లవర్ తురుము మిశ్రమాన్ని ఉంచి పూరీ అంచులు పైకి మడవాలి. దీన్ని మెల్లగా వత్తుతూ పరోటాల్లాగా చేయాలి. ఈ పరోటాల్ని ఓ స్పూను నూనె వేసి పెనం మీద కాల్చాలి. అంతే రుచికరమైన కాలీఫ్లవర్ పరోటాలు తయార్..! వీటిని చట్నీతోగానీ, పెరుగుతో గానీ ఆరగించవచ్చు.