తయారీ విధానం : పాలకూరను సన్నగా తరిగి ఉంచుకోవాలి. తరువాత పాలకూర, శెనగపిండి, గరం మసాలా పొడి, పచ్చి మిర్చి, కరివేపాకు, కొత్తి మీర, ఉప్పు, ఉడికించిన వెజిటబుల్ తరుగుల్ని వేసి బాగా కలిపి, నీటిని కొద్ది కొద్దిగా పోస్తూ గారెల పిండిలా కలుపుకోవాలి. బాణలిలో నూనె పోసి కాగిన తర్వాత పిండిని గారెలలాగా చేసుకుని నూనెలో వేయించి బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించి తీసేయాలి. ఈ గారెలకు గ్రీన్ చట్నీని సైడ్‌డిష్‌గా వాడుకోవచ్చు.