కావలసిన పదార్థాలు: కార్న్ తరుగు... ఒక కప్పు క్యారెట్... ఒక కప్పు బీన్స్... ఒక కప్పు నీరు... తగినంత వైట్‌సాస్... సరిపడా ఉప్పు... సరిపడా కారం... సరిపడా కార్న్ పౌడర్... తగినంత కొత్తిమీర తరుగు... సరిపడా
తయారీ విధానం: బీన్స్, క్యారెట్, కార్న్ తరుగులకు పది గ్లాసుల నీటిని చేర్చి అరగంట పాటు ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఇందులో కాస్తంత వైట్‌సాస్, ఉప్పు, కారం, కార్న్ పౌడర్లను చేర్చి కాసేపు వేడి చేయాలి. తరువాత స్టౌమీద నుండి దించి, కొత్తిమీర తరుగుల్ని కలుపుకోవాలి. దీనిని వేడి వేడిగా కప్‌లలో పోసి అతిథులకు ఇవ్వండి.