చింతపండు పులిహార

FILE
కావలసిన పదార్థాలు :
సన్న బియ్యం... ఒక కిలో
చింతపండు... 125 గ్రా.
ఎండుమిర్చి... 50 గ్రా.
పచ్చిమిర్చి... 50 గ్రా.
శనగపప్పు... 50 గ్రా.
మినప్పప్పు... 50 గ్రా.
ఆవాలు... 25 గ్రా.
నూనె... 125 గ్రా.
కరివేపాకు... 3 రెబ్బలు
పసుపు... ఒక చిన్న చెంచా
ఉప్పు... తగినంత

తయారీ విధానం :
చింతపండు నానబెట్టి తగినంత ఉప్పు వేసి చిక్కగా రసం చేసి వుంచుకోవాలి. అన్నం బిరుసుగా వార్చి విశాలమైన పళ్ళెంలో పోసి కాస్త ఆయిల్ పసుపు వేసి కలిపి ఆరబెట్టాలి. ఒక బాణలిలో నూనె కాచి... అందులో శనగపప్పు, మినపప్పు, ఆవాలు పోసి కాస్త వేగిన తరువాత ఎండుమిర్చి వేసి వేయించాలి.

Ganesh|
అందులోనే యింగువ కూడా వేసి, కాసేపు వేగాక రెండుగా చీల్చి ఉంచిన పచ్చిమిర్చి ముక్కలు, సరిపడా ఉప్పు వేసి బాగా వేయించాలి. ఈ మిశ్రమం బాగా వేగి, నూనె పైకి తేలిన తరువాత... ముప్పాతిక వంతు అన్నంలో వేసి కలపాలి. మిగిలిన పాతికవంతు మిశ్రమంలో చింతపండు రసం పోసి, కాసేపు ఉడికించి అనంతరం.. ఇది కూడా అన్నంలో పోసి, బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అంతే చింతపండు పులిహోర రెడీ అయినట్లే..!


దీనిపై మరింత చదవండి :