కావలసిన పదార్థాలు :బంగాళాదుంపలు... ఆరుటొమోటోలు... రెండుమెంతి ఆకులు... రెండు కప్పులుఉల్లిపాయలు... రెండుఅల్లంతురుము.. రెండు టీ.ఇంగువ... పావు టీ.కారం... రెండు టీ.పసుపు... అర టీ.ధనియాలపొడి... ఒక టీ.గరంమసాలా... ఒక టీ.ఉప్పు... తగినంనెయ్యి లేదా నూనె... రెండు టీ.తయారీ విధానం :తగినన్ని నీళ్లలో చిటికెడు ఉప్పు, పంచదార కలిపి అందులో మెంతి ఆకుల్ని వేసి ఐదు నిమిషాలు అలాగే ఉంచాలి. తరువాత మెంతి ఆకుల్ని తీసి నీరంతా పోయేదాక ఆరబెట్టాలి. పాన్‌లో నెయ్యి లేదా నూనె వేసి, వేడయ్యాక అల్లం తురుము, ఇంగువ, ధనియాలపొడి, పసుపు, కారం వేసి కలియబెట్టాలి.అందులోనే కొద్దిగా నీళ్లుపోసి కొన్ని నిమిషాలు ఉడికించాలి. అందులోనే తరిగిన టొమోటో ముక్కల్ని, తగినంత ఉప్పును వేసి మెత్తగా ఉడికించాలి. ఆపై ఉడికించిన బంగాళాదుంప ముక్కలు కాసేపు ఉడికించి, తరువాత మెంతి ఆకులను కలపాలి. మెంతి ఆకులు బాగా వేగిన తరువాత గరంమసాలా పొడిని వేసి కలియబెట్టాలి. అంతే వేడి వేడి ఆలూ మెతి టొమోటో సబ్జీ రెడీ అయినట్లే...! దీన్ని రోటీలు లేదా పరోటాలు మరియు అన్నంలో కలుపుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది. |