కావలసిన పదార్థాలు :మామిడికాయలు... ఒక కేజీఉప్పు... వంద గ్రా.ఆవాలు పొడి... 25 గ్రా.వెల్లుల్లిముద్ద... 25 గ్రా.అనాస, మెంతి, జీలకర్ర కలిపి నూరిన మసాలా... 50 గ్రా.వేయించి పొడి చేసిన ఎండుమిర్చి... 50 గ్రా.ఆవనూనె... అర కేజీతయారీ విధానం :పచ్చి మామిడికాయల తొక్కు తీసి రెండు మూడు సెంటీమీటర్ల పొడవు, వెడల్పులతో ముక్కలు కోయాలి. ఈ ముక్కలను ఎండలో ఎండనివ్వాలి. కాస్త ఎండాక ఉప్పు కలిపి మళ్లీ ఎండలో పెట్టి రోజంతా ఎండనివ్వాలి. వాటిని ఓ రాత్రంతా అలా వదిలేసి ఉంచాలి. దాంతో ముక్కల నుంచి నీరు ఊరుతుంది. ఆ తరువాత వాటినలాగే 8-10 రోజులపాటు ఎండలో ఎండనివ్వాలి.ఉప్పు, కారం, ఆవాల పొడి, వెల్లుల్లిముద్ద, అనాస మసాలా అన్నింటినీ ఒక పాత్రలో వేసి కలిపి ఉంచాలి. ఈ మిశ్రమాన్ని ఎండిన ముక్కల్లో కలిపి చివరగా నూనె కలిపి జాడీలోకి పెట్టాలి. ఈ జాడీని 15-20 రోజులపాటు ఎండలో ఉంచి తీయాలి. అంతే బెంగాలీ ఆమ్-తాల్ రెడీ అయినట్లే...! |