ప్రధాన పేజి > ఇతరాలు > వంటకాలు > భారతీయ > చపాతీ కర్రీ "కొబ్బరి శనగపప్పు"
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
చపాతీ కర్రీ "కొబ్బరి శనగపప్పు"
FILE

కావలసిన పదార్థాలు :
శనగపప్పు... రెండు కప్పులు
పచ్చికొబ్బరి తురుము... ఆరు టీ.
ఉల్లిపాయలు... రెండు
పచ్చిమిర్చి... నాలుగు
ఉప్పు... సరిపడా
క్యారెట్లు... రెండు
నూనె... రెండు టీ.
ఆవాలు, జీలకర్ర ... చెరో టీ.
వెల్లుల్లి రెబ్బలు... పది
ఎండుమిర్చి... నాలుగు
కరివేపాకు రెమ్మలు... నాలుగు

తయారీ విధానం :
శనగపప్పును కుక్కర్‌లో ఉడికించాలి. ఒక పాత్రలో నూనె వేసి వేడయక్యాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లి వేసి వేయించాలి. పచ్చిమిర్చి, ఉల్లిపాయల్ని కూడా వేసి లేత గోధుమ రంగు వచ్చేదాకా వేయించాలి. ఆ తరువాత ఓ మోస్తరుగా ముందే ఉడికించి పెట్టుకున్న క్యారెట్‌ని వేసి ఐదు నిమిషాలు వేయించాలి.

తరువాత అందులో ఉడికించిన శనగపప్పు, ఉప్పు వేసి కలియబెట్టి మూడు నిమిషాలు వేయించాలి. ఆపై కొబ్బరితురుము వేసి మరో ఐదు నిమిషాలు వేయించి దించేయాలి. అంతే వేడి వేడి కొబ్బరి శనగపప్పు కూర సిద్ధమైనట్లే... దీన్ని వేడి వేడి అన్నం, చపాతీల్లో కలుపుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
వెరైటీ ఊరగాయ "బెంగాలీ ఆమ్‌-తాల్‌"
రోటీల కోసం "ఆలూ మెంతి టొమోటో సబ్జీ"
వెరైటీ డిష్ "ఆలూ స్వీట్ బూందీ కప్స్"
ఆరోగ్యప్రదాయిని "ఉసిరికాయ పచ్చడి"
చక్కెర వ్యాధిగ్రస్థులకు "బొప్పాయి జ్యూస్"
"ఉప్పుచేప వంకాయ కూర"తో పసందు