కావలసిన పదార్థాలు :గుమ్మడికాయ... అర కేజీబెల్లం... వంద గ్రా.ఉల్లిపాయ... ఒకటిపచ్చిమిర్చి... ఆరుటమోటోలు... రెండుఎండుమిర్చి... నాలుగుపసుపు... కాస్తంతజీలకర్ర... కొద్దిగాఆవాలు... అర టీ.కారం... రెండు టీ.మినప్పప్పు... ఒక టీ.కరివేపాకు... రెండు రెబ్బలుఉప్పు... తగినంతనూనె... మూడు టీ.చింతపండు... వంద గ్రా.తయారీ విధానం :గుమ్మడికాయను ముక్కలుగా కోసుకోవాలి. బాణలిలో నూనెవేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేయించాలి. తర్వాత గుమ్మడి ముక్కలు, ఉప్పు, కారం, పసుపు కలిపి మగ్గనివ్వాలి. తరువాత చింతపండు పులుసు, బెల్లం, టమోటో ముక్కలు వేయాలి. చివరగా వెల్లుల్లి, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకుతో పోపు పెట్టుకోవాలి. అంతే గుమ్మడికాయ దప్పనం సిద్ధమైనట్లే..! దీన్ని వేడి అన్నం, చపాతీలతో పాటు కలిపి తింటే చాలా టేస్టీగా ఉంటుంది. |